
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడన్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ చిత్రం లాంచనంగా ప్రారంభం అయినప్పటికీ.. షూటింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. అయితే ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడిగా మలయాళ బ్యూటీని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో వైష్ణవ్‌కు జోడిగా మేఘా ఆకాష్‌ను తీసుకున్నట్లు వార్తలు వినిపించినా.. తాజాగా మరో హీరోయిన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇటీవలె మలయాళంలో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న దేవికా సంజయ్‌ను ఈ చిత్రంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్టర్‌గా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment