
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా మొదటి పాట వచ్చేసింది. ‘ఎంత సక్కగున్నావే..’ అంటూ రామలక్ష్మిని పొడుగుతూ చిట్టిబాబు పాడుకున్న ఈ పాట అభిమానులను అలరిస్తోంది. ప్రేమికుల రోజు కానుకగా మంగళవారం ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. విడుదలైన గంటలోనే మూడున్నర లక్షల పైచిలుకు వ్యూస్ దక్కించుకుంది. రామలక్ష్మి, చిట్టిబాబు పాత్రల్లో సమంత, రామ్‌చరణ్ నటించారు.
‘‘హో.. హో.. హో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం...’’ అంటూ రామ్‌చరణ్ వాయిస్‌తో సాగే టీజర్ ఇంతకుముందు విడుదలై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా విడుదలైన పాట కూడా అభిమానులను కట్టిపడేస్తోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను స్వీయ స్వరకల్పనలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాడారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది.
Comments
Please login to add a commentAdd a comment