DJ Seetimaar Hindi Remake: Devi Sri Prasad Interesting Comments On Radhe Song - Sakshi
Sakshi News home page

అందుకే నా పాటల్లో హిందీ పదాల ప్రభావం ఉంటుంది: దేవిశ్రీ

Published Thu, May 6 2021 4:57 PM | Last Updated on Thu, May 6 2021 6:50 PM

Devi Sri Prasad Comments On Seetimaarr Hindi Remake Song  - Sakshi

దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికి తెలిసిందే. దక్షిణాన రాక్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ సంగీతం వల్లే ఎన్నో పాటలు సూపర్‌ హిట్టాయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన మ్యూజిక్‌ మహిమతో కరోనా కాలంలో కూడా ప్రేక్షకులను థీయేటర్‌కు తీసుకురాగలిగాడు డీఎస్పీ. ఇదిలా ఉంటే దేవి శ్రీ సంగీతం అందించిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘డీజే’ మూవీలోని సిటీమార్‌ సాంగ్‌ సౌత్‌లో ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. 

అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈ పాటను బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రం ‘రాధే’లో కూడా రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా సిటీమార్‌ బి-టౌన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకని ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా డీఎస్పీ సిటీమార్‌ హిందీ రీమేక్‌, సల్మాన్‌ ఖాన్‌ గురించి మాట్లాడుతూ.. ‘సిటీమార్‌ సాంగ్‌ ఇప్పటికే దక్షిణాన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘డింకా చికా’, ‘రింగా రింగా’ కూడా చేశాను. ఈ పాటలు ఎంత హిట్‌ అయ్యాయో మీకు కూడా తెలుసు.

హిందీలో ఎదైనా సాధ్యమే కానీ సల్మాన్ ఖాన్ వంటి సూపర్‌ స్టార్‌తో కలిసి చేయడమనేది అసాధారణమైన విషయం కాదు. అందుకే ప్రపంచం వ్యాప్తంగా ‘డింకా చికా’ అంతగా వైరల్‌ అయ్యింది. ఇది మీకు కూడా తెలుసు. ఇక నేను ప్రపంచంలో ఎక్కడ పాడినా ‘రింగా రింగా’, ‘డింకా చికా డింకా చిక’ పాటలతో ముగ్గిస్తాను. నాకు అంత్యంత ఇష్టమైన పాటలు ఇవే. ఇక సల్మాన్ ఖాన్‌లో నేను ఇష్టపడేది ఏమిటంటే.. దేనినైనా ఆయన ఇట్టె పట్టేస్తాడు. అది సీన్‌ అయినా కొరియోగ్రఫీ అయినా.. అందుకే ఎదుటి వారు ఆయనకు తక్కవ సమయంలోనే ఆకర్షితులవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే సిటీమార్‌ హిందీ రీమేక్ చేసే అవకాశం ఎలా వచ్చిందని, తెలుగు పాటను హిందీలో రీమేక్‌ చేయడం ఎలా సాధ్యమైందని యాంకర్‌ అడగ్గా.. ‘ప్రభుదేవ మాస్టర్‌ నన్ను పిలిచి ఇలా అడిగారు.

ఆయన హిందీలో సల్మాన్ ఖాన్‌తో రాధే మూవీ చేస్తున్నానని, దానికి నాకు ఒక మంచి సూపర్‌ హిట్‌ సాంగ్‌ కావాలన్నారు. అప్పటికే ప్రభుదేవా మాస్టర్‌ దర్శకత్వం వహించిన తెలుగు, తమిళంలోని ఎన్నో సినిమాలకు సంగీతం అందించాను. అయితే సిటీమార్‌ నేను హిందీలో చేయాలనుకుంటున్న పాటలో ఒకటి. ఎందుకంటే దక్షిణాన మంచి విజయం సాధించిన ఈ పాట హిందీలో కూడా సూపర్‌ హిట్‌ అవుతందని నేను అప్పుడే భావించాను. నా పాటల్లో కూడా హిందీ పదాల ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణం కూడా అదే. ఎందుకంటే హిందీలోని ఒక పదం మిగతా భాషల్లో కూడా వాడుకలో ఉంటుంది. దీని వల్ల ఇది ఏ భాష సంగీతానికి, ట్యూన్‌కు బాగా సరిపోతాయి. ఈ క్రమంలో అది తన మనోజ్ఞోతను, కవితా స్వభావాన్ని కోల్పోదు’ అటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: 
సీటీమార్: సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్స్‌ చూసేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement