ఇదే నా ప్రామిస్‌: దేవీశ్రీ ప్రసాద్‌ | Devi Sri Prasad Speech At Sarileru Neekevvaru Movie Opening | Sakshi
Sakshi News home page

ఇదే నా ప్రామిస్‌: దేవీశ్రీ ప్రసాద్‌

Published Fri, May 31 2019 4:40 PM | Last Updated on Fri, May 31 2019 4:56 PM

Devi Sri Prasad Speech At Sarileru Neekevvaru Movie Opening - Sakshi

‘మహర్షి’ సినిమా ఎలా ఉన్నా.. మ్యూజిక్‌ పరంగా తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో దేవీ శ్రీ ప్రసాద్‌ను ఏకిపారేస్తున్నారు. మహేష్‌-అనిల్‌ రావిపూడి సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ను తీసుకోవద్దని సోషల్‌ మీడియాలో నేరుగా నమ్రతకే సూచిస్తున్నారు.

ఇదంతా ఓ వైపు జరుగుతుండగా.. మహేష్‌ బాబు- అనిల్‌ రావిపూడి సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేయడం, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీనే కన్‌ఫర్మ్‌ చేయడం జరిగిపోయింది. అయితే అభిమానులు చేస్తున్న కామెంట్స్‌ దేవీ చెంతకు చేరిపోయాయో ఏమో కాని నేడు జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌ అభిమానులకు ఓ మాటిచ్చాడు. తాను ఇంతవరకు మహేష్‌ బాబుతో చేసిన సినిమాల్లోని కథ పరంగా మంచి మాస్‌ బీట్‌ ఇవ్వలేకపోయాయని అన్నారు.

ఎక్కడ పార్టీ జరిగినా ఈ పాట పెట్టాల్సిందే.. అనేట్టుగా ఓ మాస్‌ బీట్‌ను కంపోజ్‌ చేస్తానని, ప్రేమికులు ఈ పాటను ప్లే చేయకుండా లవ్‌ చేసుకోకూడదు అని ఉండేలా ఓ లవ్‌ సాంగ్‌ను ఇస్తానని మహేష్‌ అభిమానులకు ప్రామిస్‌ చేశాడు. అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement