టాలీవుడ్‌లో టాప్ పోజిషన్‌లో ఉన్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ఇటీవల తన స్థాయికి తగ్గ మ్యూజిక్ హిట్స్ ఇవ్వడంలో కాస్త ఇబ్బంది పడుతున్న దేవీ, ఈ వారం మహర్షితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహర్షి పై దేవీ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.
తాజాగా దేవీ శ్రీ సంగీతమందించిన ఓ పాట అంతర్జాతీయ వేదిక మీద ప్రశంసలు అందుకుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ కాంపిటీషన్‌గా పేరున్న ‘ఎన్‌బీసీ వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’ ఫినాలేలో కింగ్స్ టీం, దేవీ పాటకు డ్యాన్స్ చేసింది. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలోనే ‘ఆడేవడన్నా.. ఈడేవడన్న’ అనే పాటను ప్రదర్శించిన కింగ్స్ టీం ప్రేక్షకులతో పాటు న్యాయనిర్ణేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ విషయంపై దేవీ శ్రీ ప్రసాద్ ట్విటర్ వేదికగా స్పందించాడు. గతంలో అదే వేదిక మీద తాను సంగీతమందించిన ఖైదీ నంబర్ 150 సినిమాలో సుందరి పాటను ప్రదర్శించిన సంగతిని గుర్తు చేసుకున్నాడు. నా సంగీతం ప్రజలతో డ్యాన్స్ చేయించటం నాకు ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
OMG ! What a Brilliant Performance!!👏🏻👏🏻🙏🏻
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 6 May 2019
That time it was #SUNDARI frm #Khaidi150 & now it is #Vadevadanna frm #SARDARGabbarSingh on d International Dance Stage !!
Am so Thrilled wn my MUSIC makes People DANCE !!
ThankU & Lov U guys !
U just nailed it !!
Keep Roc’KING’S !! https://t.co/mfkd1BhwJG
Comments
Please login to add a commentAdd a comment