
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ జిగర్‌తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు దేవీ స్థానంలో మిక్కీ జే మేయర్‌ను తీసుకున్నారట. మరి ఇప్పటికైన వాల్మీకి టీం ఈ వార్తలపై స్పందిస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment