థ్రిల్లింగ్ కామెడీ! | Banthi Poola Janaki Movie | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్ కామెడీ!

Published Sat, Apr 2 2016 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

థ్రిల్లింగ్ కామెడీ!

థ్రిల్లింగ్ కామెడీ!

హాస్యనటుడు ధన్‌రాజ్, దీక్షాపంథ్ జంటగా థ్రిల్లింగ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బంతిపూల జానకి’. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా తెరకెక్కించాం.
 
 ఈ నెల చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో కానీ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘నాపై, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో నిర్మాత కల్యాణిరామ్‌గారు ఒక్కసారి కూడా సెట్‌కి రాలేదు. ఆయన మాపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేశాం’’ అని ధన్‌రాజ్ అన్నారు. దీక్షాపంథ్, ‘షకలక’ శంకర్, ‘సుడిగాలి’ సుధీర్, ‘రాకెట్’ రాఘవ, కెమేరామ్యాన్ జి.లింగబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement