Diksha Panth
-
మరో బోల్డ్ ఆపరేషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫీవర్ స్టార్టయ్యింది. ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమయింది. ఇలాంటి టైమ్‌లో రాజకీయ, సామాజిక అంశాలతో తయారయ్యే కథలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఆ కోవకు చెందిన సినిమానే ‘ఆపరేషన్ 2019’. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ఉప శీర్షిక. అలివేలు ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం బాబ్జి దర్శకుడు. ‘‘మాది సెన్సేషనల్ పొలిటికల్ ఎడ్వంచర్ మూవీ. ఈ నెల 28న విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు అన్నారు. ‘ఆపరేషన్ ధుర్యోధన’ లాంటి బోల్డ్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు శ్రీకాంత్. ఆయన హీరోగా నటిస్తూ, సమర్పిస్తున్న ‘ఆపరేషన్ 2019’ కూడా అంతే బోల్డ్‌గా ఉంటుందట. శ్రీకాంత్ సరసన యజ్ఞా శెట్టి , ధీక్షా పంత్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇంకా సుమన్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళీ, నాగినీడు, హరితేజలతో పాటు దాదాపు 40 మంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, కెమెరా: వెంకట ప్రసాద్. -
ఐస్‌క్రీం భామ సూపర్!
-
`ఇగో` మూవీ రివ్యూ
టైటిల్ : ఇగో జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావు రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : సుబ్రమణ్యం నిర్మాత : విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ ఆసక్తికరమైన కథా కథనాలతో తెరకెక్కిన చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఆ తరహా చిత్రాలను రూపొందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అదే బాటలో ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా ఇంట్రస్టింగ్ పాయింట్ కు లవ్ స్టోరి, కామెడీలను జోడించి ఇగో సినిమాను తెరకెక్కించారు. మరీ ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? కథ : గోపి (ఆశిష్ రాజ్), ఇందు (సిమ్రాన్)లు ఇద్దరు ఇగోతో ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. తరతరాలుగా వారిద్దరి కుటుంబాలకు ఒకరంటే ఒకరు పడదు. దీంతో ఇందుని ఇబ్బంది పెట్టాలని గోపి, గోపిని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఇందు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఈ గోడవలు ఇంట్లో తెలియటంతో ఇందుకు పెళ్లి సంబంధం చూస్తారు. అమెరికాలో స్థిరపడిన అబ్బాయితో ఇందుకి పెళ్లి కుదురుతుంది. ఇగో గోపి ఇందుకు కన్నా ముందే మంచి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి హైదరాబాద్ వస్తాడు. అప్పుడే ఇందు, గోపిలకు ఒకరంటే ఒకరికి ప్రేమని తెలుస్తుంది. ఇద్దరు కలుసుకునే సమయానికి గోపిని ఓ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. పూర్వి (దీక్షాపంత్) అనే అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమె ఫోన్లో గోపితో దిగిన సెల్ఫీతో పాటు, హత్య జరగటానికి ముందుకు గోపితో 40 నిమిషాలు మాట్లాడినట్టు, హత్య జరిగిన తరువాతి రోజు పూర్వి అకౌంట్ నుంచి గోపి 40 వేలు డ్రా చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యాలుగా ఉంటాయి. దీంతో అంతా గోపినే ఈ హత్య చేశారని భావిస్తారు. అసలు పూర్విని హత్య చేసింది ఎవరు..? ఆ కేసులో గోపిని ఎందుకు ఇరికించారు..? ఈ కేసునుంచి గోపి ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఆకతాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆశిష్ రాజ్, రెండో ప్రయత్నంలో పరవాలేదనిపించాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో నటన విషయంలో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ గా పరిచయం అయిన సిమ్రాన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఫేం దీక్షా పంత్‌ది చిన్న పాత్రే అయిన ఉన్నంతలో తన పరిధిమేరకు పాత్రకు న్యాయం చేసింది. రావూ రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీలు రొటీన్ పాత్రల్లో నిరాశపరిచారు. ఫస్ట్ హాఫ్ లో పృధ్వీ కామెడీ కాస్త నవ్విస్తుంది. విశ్లేషణ : తనకేది సంబంధం లేని కేసులో ఇరుక్కున్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ ను కథగా ఎంచుకున్న దర్శకుడు ఆ పాయింట్ ను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మెయిన్ పాయింట్ కు సపోర్ట్ గా ఎంచుకున్న ప్రేమకథ, కామెడీ ఏమాత్రం ఆకట్టకోకపోవటం. అసలు కథ ద్వితియార్థంలో గాని మొదలు కాకపోవటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కావాలని ఇరికించిన పంచ్ డైలాగ్ లు కామెడీ సీన్స్ విసిగిస్తాయి. అయితే హీరో మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. అదే స్థాయిలో సినిమాను ముందుకు నడిపించలేకపోయాడు. సాయికార్తీక్ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. -
బిగ్‌బాస్: దీక్ష సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు బిగ్బాస్షో తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంతో తొలి సీజన్‌కు శుభం కార్డు పడనుంది. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న షోకు పెద్ద ఎత్తున టీఆర్పీ రేటింగులు కూడా వచ్చాయి. గతవారం వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చిన దీక్ష పంత్ ఎలిమినేట్ అవ్వగా.. ఐదుగురు ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఎలిమినేట్ అయ్యి ఇంటికి చేరుకున్న దీక్ష సంచలన విషయాలను వెల్లడించింది. ఇంటి సభ్యుల మీద దీక్ష తీవ్ర ఆరోపణలు చేసింది. షోలో తనను అందరూ కావాలనే ఒంటరి చేశారని ఆరోపించింది. ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు తన గురించే మాట్లాడుతున్నారని వాపోయింది. ముఖ్యంగా అర్చన తనను టార్గెట్ చేస్తూ మాట్లాడటం బాధ కలిగిస్తోందని దీక్ష తెలిపింది. బిగ్‌బాస్‌షోకు ముందు ధనరాజ్ తాను బంతిపూల జానకీ సినిమా చేశామని.. అప్పడు తనను బయట కలుద్దామని అడిగేవాడని.. అందుకు తాను అంగీకరించలేదని చెప్పింది. ఆ కారణంతో ధనరాజ్ బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తనను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపింది. అంతేకాదు ఇంటికి వచ్చి ఎపిసోడ్లు చూసుకుంటే తాను తింటున్న, నిద్రపోయిన, ఏడ్చే సీన్లు చూపించారని దీక్ష ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. -
థ్రిల్లింగ్ కామెడీ!
హాస్యనటుడు ధన్‌రాజ్, దీక్షాపంథ్ జంటగా థ్రిల్లింగ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బంతిపూల జానకి’. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా తెరకెక్కించాం. ఈ నెల చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో కానీ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘నాపై, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో నిర్మాత కల్యాణిరామ్గారు ఒక్కసారి కూడా సెట్‌కి రాలేదు. ఆయన మాపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేశాం’’ అని ధన్‌రాజ్ అన్నారు. దీక్షాపంథ్, ‘షకలక’ శంకర్, ‘సుడిగాలి’ సుధీర్, ‘రాకెట్’ రాఘవ, కెమేరామ్యాన్ జి.లింగబాబు తదితరులు పాల్గొన్నారు. -
నవ్వులే....నవ్వులు!
బుల్లితెరపై తమ హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్న ధన్‌రాజ్, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘రాకెట్’ రాఘవ, ‘సుడిగాలి’ సుధీర్ వెండితెరపై సందడి చేయనున్నారు. వీరి కాంబినేషన్లో నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణిరామ్ నిర్మిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. దీక్షాపంత్ కథా నాయిక. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాదింలో విజయం సాధించే చిత్రాల జాబితాల్లో కచ్చితంగా ఉంటుం దన్న నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్. -
ఇది నా లక్కీ సిటీ..దీక్షాపంత్
‘ఈ సిటీకి చాలా రుణపడిపోయా. ఇది ఓ రకంగా నా లక్కీ సిటీ’ అంటూ భాగ్యనగరంపై తన ప్రేమను తెలియజేసింది నార్త్ ఇండియన్ బ్యూటీ దీక్షాపంత్. బంజారాహిల్స్ రోడ్ నెం3 లోని పారిస్ ది సెలూన్‌ను రీ లాంచ్ చేసిన అనంతరం ఈ సుందరి ‘సాక్షి’తోత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి కెరీర్‌కి తొలి అడుగులు ఇక్కడే... మాది ఉత్తరాఖండ్. పుట్టి పెరిగింది అంతా అక్కడే అయినా... నా మోడలింగ్ కెరీర్‌కు పునాది పడింది ఇక్కడే. హార్లీ డేవిడ్సన్ షోరూం లాంచ్ సందర్భంగా జరిగిన షోలో పాల్గొన్నాను. అలాగే సినీకెరీర్‌కు కూడా ఇక్కడే ఫస్ట్ స్టెప్. అందుకే నాకు హైదరాబాద్ లక్కీ సిటీ. మోడలింగ్ పనుల నిమిత్తం ముంబయి వెళ్లి వస్తున్నా, ప్రస్తుతం పేరెంట్స్‌తో సహా ఇక్కడే ఉంటున్నాను. టాలీవుడ్లో ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని ఒక తెలుగు సినిమాలో చేస్తున్నా. మరిన్ని మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాను. నా స్టైలిస్ట్ నేనే... సినిమాల విషయం ఎలా ఉన్నా... వ్యక్తిగతంగా నా స్టైలిస్ట్ నేనే. నాకు డ్రెస్ సెలక్షన్లో మంచి టేస్ట్ ఉంది. ఎక్కువ మేకప్ చేసుకోవడం నచ్చదు. అవసరాన్ని బట్టి పార్లర్స్ సర్వీస్‌లలో అంటే వాక్సింగ్, హెడ్ మసాజ్ వంటివి చేయిస్తుంటాను. అంతే. ఫిట్నెస్ కోసం మినిమిమ్ వర్కవుట్ల మీద ఆధారపడతా. మోడలింగ్ కన్నా యాక్టింగ్ కష్టం... మోడల్-యాక్టర్.. ఈ రెండింటిలో చెప్పాలంటే యాక్టింగ్ కష్టం. స్క్రీన్ మీద అందం ఒక్కటే చాలదు, అభినయం కూడా కావాలి. అలాగే మోడలింగ్‌లో ఫేస్ గ్లామర్ కన్నా ఫిగర్ ప్రధానం. కానీ సినిమాకు రెండూ కావాల్సి వచ్చినా, ఫేస్ లుక్ ఇంకొంచెం ఎక్కువ అవసరం. సినిమాల గురించి... ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదే. తెలుగు, తమిళ భాషల మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇకపై లీడ్ క్యారెక్టర్స్‌ని ఎంచుకుందామనుకుంటున్నా. బాలీవుడ్లో మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. ఫ్యాషన్‌లో ప్రియాంక చోప్రా వేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. తెలుగులో నా ఫేవరెట్ హీరో మహేష్‌బాబు. తనని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అంతే అందంగా ఉన్నాడు. గ్లామర్ మెయిన్‌టెయిన్ చేయడంలో ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. -
కవ్వింత మూవీ స్టిల్స్