మరో బోల్డ్‌ ఆపరేషన్‌ | Operation 2019 movie released on september 28 | Sakshi
Sakshi News home page

మరో బోల్డ్‌ ఆపరేషన్‌

Published Sun, Sep 9 2018 2:18 AM | Last Updated on Sun, Sep 9 2018 2:18 AM

Operation 2019 movie released on september 28 - Sakshi

శ్రీకాంత్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ ఫీవర్‌ స్టార్టయ్యింది. ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమయింది. ఇలాంటి టైమ్‌లో రాజకీయ, సామాజిక అంశాలతో తయారయ్యే కథలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఆ కోవకు చెందిన సినిమానే ‘ఆపరేషన్‌ 2019’. ‘బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌’ అనేది ఉప శీర్షిక. అలివేలు ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం బాబ్జి దర్శకుడు. ‘‘మాది సెన్సేషనల్‌ పొలిటికల్‌ ఎడ్వంచర్‌ మూవీ. ఈ నెల 28న విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు అన్నారు.

‘ఆపరేషన్‌ ధుర్యోధన’ లాంటి బోల్డ్‌  సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు శ్రీకాంత్‌. ఆయన హీరోగా నటిస్తూ, సమర్పిస్తున్న ‘ఆపరేషన్‌ 2019’ కూడా అంతే బోల్డ్‌గా ఉంటుందట. శ్రీకాంత్‌ సరసన యజ్ఞా శెట్టి , ధీక్షా పంత్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇంకా సుమన్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళీ, నాగినీడు, హరితేజలతో పాటు దాదాపు 40 మంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్‌ రాక్‌ షకీల్, కెమెరా: వెంకట ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement