ఇది నా లక్కీ సిటీ..దీక్షాపంత్ | It's my lucky city Diksapant | Sakshi
Sakshi News home page

ఇది నా లక్కీ సిటీ..దీక్షాపంత్

Published Fri, Jun 19 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

ఇది నా లక్కీ సిటీ..దీక్షాపంత్

ఇది నా లక్కీ సిటీ..దీక్షాపంత్

‘ఈ సిటీకి చాలా రుణపడిపోయా. ఇది ఓ రకంగా నా లక్కీ సిటీ’ అంటూ భాగ్యనగరంపై తన ప్రేమను తెలియజేసింది నార్త్ ఇండియన్ బ్యూటీ దీక్షాపంత్. బంజారాహిల్స్ రోడ్ నెం3 లోని పారిస్ ది సెలూన్‌ను రీ లాంచ్ చేసిన అనంతరం ఈ సుందరి ‘సాక్షి’తోత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
కెరీర్‌కి తొలి అడుగులు ఇక్కడే...
మాది ఉత్తరాఖండ్. పుట్టి పెరిగింది అంతా అక్కడే అయినా... నా మోడలింగ్ కెరీర్‌కు పునాది పడింది ఇక్కడే. హార్లీ డేవిడ్సన్ షోరూం లాంచ్ సందర్భంగా జరిగిన షోలో పాల్గొన్నాను. అలాగే సినీకెరీర్‌కు కూడా ఇక్కడే ఫస్ట్ స్టెప్. అందుకే నాకు హైదరాబాద్ లక్కీ సిటీ. మోడలింగ్ పనుల నిమిత్తం ముంబయి వెళ్లి వస్తున్నా, ప్రస్తుతం పేరెంట్స్‌తో సహా ఇక్కడే ఉంటున్నాను. టాలీవుడ్‌లో ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని ఒక తెలుగు సినిమాలో చేస్తున్నా. మరిన్ని మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాను.
 
నా స్టైలిస్ట్ నేనే...
సినిమాల విషయం ఎలా ఉన్నా... వ్యక్తిగతంగా నా స్టైలిస్ట్ నేనే. నాకు డ్రెస్ సెలక్షన్‌లో మంచి టేస్ట్ ఉంది. ఎక్కువ మేకప్ చేసుకోవడం నచ్చదు. అవసరాన్ని బట్టి పార్లర్స్ సర్వీస్‌లలో అంటే వాక్సింగ్, హెడ్ మసాజ్ వంటివి  చేయిస్తుంటాను. అంతే. ఫిట్‌నెస్ కోసం మినిమిమ్ వర్కవుట్‌ల మీద ఆధారపడతా.
 
మోడలింగ్ కన్నా యాక్టింగ్ కష్టం...
మోడల్-యాక్టర్.. ఈ రెండింటిలో చెప్పాలంటే యాక్టింగ్ కష్టం. స్క్రీన్ మీద అందం ఒక్కటే చాలదు, అభినయం కూడా కావాలి. అలాగే మోడలింగ్‌లో ఫేస్ గ్లామర్ కన్నా ఫిగర్ ప్రధానం. కానీ సినిమాకు రెండూ కావాల్సి వచ్చినా, ఫేస్ లుక్ ఇంకొంచెం ఎక్కువ అవసరం.
 
సినిమాల గురించి...
ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదే. తెలుగు, తమిళ భాషల మీద కాన్సన్‌ట్రేట్ చేశాను. ఇకపై లీడ్ క్యారెక్టర్స్‌ని ఎంచుకుందామనుకుంటున్నా. బాలీవుడ్‌లో మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. ఫ్యాషన్‌లో ప్రియాంక చోప్రా వేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. తెలుగులో నా ఫేవరెట్ హీరో మహేష్‌బాబు. తనని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అంతే అందంగా ఉన్నాడు. గ్లామర్ మెయిన్‌టెయిన్ చేయడంలో ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement