ఎవరికి ఎవరో! | Upcoming Movies Of Suman Shetty | Sakshi
Sakshi News home page

ఎవరికి ఎవరో!

Published Wed, Aug 24 2016 12:33 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

ఎవరికి ఎవరో! - Sakshi

ఎవరికి ఎవరో!

వీఏకే భాస్కర్ దర్శకత్వంలో దేవీకృష్ణ సినిమా పతాకంపై సిస్టర్ కుమారి, శాబోలి రమాదేవి గౌడ్ నిర్మిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘నువ్వు ఎవరో నేను ఎవరో’. సుమన్ శెట్టి, ‘చిత్రం’ శీను, ‘జబర్దస్త్’ చిట్టి, రూపశ్రీ, శిల్ప, మేఘనా రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘సుమన్ శెట్టి, కౌబాయ్‌గా చిట్టిబాబు, కామెడీ విలన్‌గా స్వామి నాయక్ ప్రేక్షకులను నవ్విస్తారు. ‘చిత్రం’ శీను విలన్‌గా నటించారు. నవ్విస్తూ భయపెడుతుందీ సినిమా. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్ పూర్తిచేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దేవీకృష్ణ, కెమేరా: తిరుమల్, సంగీతం: రమణ సాకు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement