బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీకి చాలా పవర్ ఉంది. అందర్నీ ఆజమాయిషీ చేయడం కన్నా ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందన్న క్రేజే ఎక్కువ. కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఎంచక్కా నామినేషన్స్ తప్పించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చని హౌస్‌మేట్స్ భావిస్తుంటారు. అలాంటి కెప్టెన్సీని గతంలో ఇమ్మాన్యుయేల్ (Emmanuel) చేతులారా వదిలేసుకున్నాడు.
సంజనా కోసం త్యాగం
సంజనా (Sanjana Galrani)ను హౌస్‌మేట్స్ మిడ్‌వీక్‌లో ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే కదా! తను హౌస్‌లోకి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాలని నాగార్జున కండీషన్ పెట్టారు. తనూజ కాఫీ వదిలేయాలని, రీతూ జుట్టు కత్తిరించుకోవాలని, భరణి.. తనకిష్టమైన లాకెట్ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ వదిలేయాలన్నారు. వీళ్లందరూ ఆ త్యాగాలు చేశారు కాబట్టే సంజనా హౌస్‌లో ఉంది.
మళ్లీ సంపాదించిన ఇమ్మూ
అలా ఇమ్మాన్యుయేల్ తన కెప్టెన్సీని కనీసం ఒకరోజైనా ఫీల్ అవలేకపోయాడు. అయితేనేం మళ్లీ ఆడి గెలిచే సత్తా తనకుంది. అది ఈ వారం మరోసారి రుజువు చేసుకున్నాడని తెలుస్తోంది. ఫోకస్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కెప్టెన్‌గా ఇమ్మూ రూలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం!
చదవండి: బిగ్‌బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా!


