
మలబార్ గోల్డ్ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన 22 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఆరు నెలల కాలంలో 22 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనుంది. అలాగే అవుట్‌లెట్స్ సంఖ్యను 2020 నాటికి 300 తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరింత మంది వినియోగదారులకు చేరువకావడమే తమ ప్రధాన లక్ష్యమని మలబార్ గ్రూప్ చైర్మన్ అహమ్మద్ తెలిపారు.