విస్తరణ బాటలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ | Malabar Gold and Diamonds planning to expansion thier bussiness | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

Published Fri, Oct 25 2013 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

విస్తరణ బాటలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ - Sakshi

విస్తరణ బాటలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

హైదరాబాద్: ప్రపంచంలో మూడవ అతిపెద్ద  గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూవెల్లరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. వివిధ దేశాల్లో 39 షోరూమ్‌ల ఏర్పాటుకు సంబంధించి రానున్న ఆరు నెలల్లో 1.2 బిలియన్ యూఏఈ దిర్హామ్‌లను (దాదాపు రూ. 1,800 కోట్లు) వెచ్చించనుంది. సింగపూర్‌లో సంస్థ తాజాగా షోరూమ్‌ను ప్రారంభించింది.
 
 ఆగ్నేయాసియాలో ఇది మొట్టమొదటిదికాగా, ప్రపంచవ్యాప్తంగా 102వది. రానున్న ఆరు నెలల్లో మలేషియా, హాంకాంగ్‌లలో కూడా సంస్థ షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement