tanishq jewellary
-
అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు!
రాబోయే అక్షయ తృతీయ పండుగ కోసం టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ప్రత్యేక బంగారు నాణేలను ఆవిష్కరించింది. చోళ రాజవంశం స్ఫూర్తితో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించింది. పరిమితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ నాణేలను ఆభరణాల కోసం కాకుండా సేకరణ కోణంలో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు. చోళ సామ్రాజ్య వైభవం, సాంస్కృతిక శోభను చాటేలా నటరాజ నానయం, వెట్రియిన్ కారిగై నానయం, కరంతై విక్టరీ నానయం, రాజేంద్ర చోళ నానయం పేరుతో ప్రత్యేక నాణేలను తనిష్క్ రూపొందించింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... కాగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలపై పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తనిష్క్ ఏప్రిల్ 24 వరకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్‌ని కూడా పొందవచ్చు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. ఈ పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. అక్షయం అనేది అమరత్వాన్ని సూచిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం సాధించేదేదైనా శాశ్వతంగా నిలిచి ఉంటుందని హిందువుల నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇల్లు, ఆస్తి లేదా ఆభరణాలు వంటివి కొంటే అవి శాశ్వతంగా ఉంటాయని, తమకు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు -
పండుగ ఆఫర్లు.. బంగారంపై భారీ తగ్గింపు!
హైదరాబాద్: టాటా గ్రూప్ ఆభరణాల రిటై ల్ బ్రాండ్ తనిష్క్.. శుభప్రదమైన వరమహాలక్ష్మీ వేడుకల్లో భాగంగా అత్యుత్తమ ఆఫర్లను ప్రకటించింది. బంగారం ఆభరణాలపై గ్రాముకు రూ.200 వరకూ తగ్గింపు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకూ రాయితీ ఇందులో ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల అన్ని తని‹Ù్క షోరూమ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. జోయాలుక్కాస్.. అనుగ్రహ హైదరాబాద్: వివాహ సంబరాలకుగాను జోయాలుక్కాస్ ‘అనుగ్రహ’ బ్రాండ్ పేరుతో కొత్త జ్యువెలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. కాబోయే పెండ్లి కుమార్తెల కోసం రూపొందించిన ఈ ప్రత్యేక ఆభరణాలు దేశవ్యాప్తంగా తమ అన్ని షోరూమ్‌లలో లభ్యం అవుతాయని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. సంస్థ డైమండ్ జ్యువెలరీపై 25 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లూ ప్రకటన పేర్కొంది. చదవండి: అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి! -
బంగారంపై బంపరాఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ‘‘ప్రతి మహిళా ఒక వజ్రమే’’ పేరుతో నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వజ్రాభరణాలపై 20శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని తనిష్క్ షోరూంలలో ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు ఉంటుందని పేర్కొంది. -
లైట్ వెయిట్ ఆభరణాలకు తనిష్క్ హై–లైట్స్ ప్లాట్‌ఫామ్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ‘హై–లైట్స్’ ప్లాట్‌ఫామ్‌పై 3,500పైగా లైట్ వెయిట్(తేలికపాటి) ఆభరణాలను ఆవిష్కరించింది. చెవి రింగులు, ఉంగరాలు, నెక్లెస్ సెట్స్, గాజులు, పెండెంట్స్, మంగళసూత్రాలు వంటి అన్ని ఉత్పత్తులు ఇందులో లభించనున్నాయి. వీటి ధరలపై 15–20% వరకు తగ్గింపు ప్రకటించింది. ఇటీవల కస్టమర్లు అమితాసక్తి చూపుతున్న తేలికపాటి ఆభరణాలను తనిష్క్ హై–లైట్స్ వేదికగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉందని సంస్థ సీఈవో అజోయ్ చావ్లా తెలిపారు. వీటి ధరలు తక్కువ ఉండటంతో కస్టమర్లు తమ బడ్జెట్‌పై భారం లేకుండా ఎక్కువ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చన్నారు. -
TATA Tanishq: బంగారం, వజ్రాలతో మంగళ సూత్రం
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ బ్రాండ్ తనిష్క్... నూతన శ్రేణి మంగళ సూత్రాలను విడుదల చేసింది. బంగారం, వజ్రాలతో అత్యంత కళాత్మకంగా, పూర్తి వైవిధ్యంగా మొత్తం 15 రకాల డిజైన్లతో వీటిని తీర్చిద్దిద్దారు. ఆధునిక సంప్రదాయాలను అభిమానించే యువ వధువుల మనసును ఆకట్టుకొనేలా వీటిని రూపొందించామని కంపెనీ హెడ్ డిజైన్ అధికారి శ్రీ అభిషేక్ రస్తోగి తెలిపారు. అన్ని వర్గాల కమ్యూనిటీల ప్రాధాన్యతకు తగ్గట్లుగా తయారు చేయడమే కాక రోజూవారీ వస్త్రధారణతో సౌకర్యవతంగా కలిసిపోతాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే? -
నెటిజన్ల ఫైర్; యాడ్ తొలగించిన తనిష్క్!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో నటీమణులు నీనా గుప్తా, నిమ్రత్ కౌర్, సయానీ గుప్తా, అలయా ఫర్నీచర్‌వాలాలతో తనిష్క్ ఓ యాడ్ రూపొందించింది. ఇందులో సింపుల్ జువెలరీని ధరించిన వీరు.. తాము ఈసారి ఏవిధంగా పండుగ జరుపుకోబోతున్నామోనన్న వివరాల గురించి పంచుకున్నారు. ఈ దీపావళికి తాను కూడా అధిక మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తానని నీనా చెప్పగా, ఈసారి కుటుంబంతో కలిసి వేడుకలు చేసుకుంటానని నిమ్రత్ చెప్పారు. ఇక ఆలయ మాట్లాడుతూ.. దీపావళి అంటే తనకు మిఠాయిలు, రుచికరమైన భోజనం, స్నేహితులు, కుటుంబమంతా ఒక్కచోట చేరడమే గుర్తుకువస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతాబాగానే ఉన్నా.. చాలా రోజుల తర్వాత దీపావళి సందర్భంగా తన తల్లిని కలవబోతున్నందుకు సంతోషంగా ఉందన్న సయానీ గుప్తా.. ఈసారి టపాసులు లేకుండానే దీపాల పండుగ చేసుకుంటానని, దివ్వెలు మాత్రమే వెలిగిస్తానని చెప్పడం నెటిజన్లకు కోపం తెప్పించింది. ‘‘అసలు పండుగ ఎలా చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? టపాకాయలు కాలిస్తే మీకేంటి? ఉచిత సలహాలు ఇవ్వడం మానేయండి. ఒకసారి చేదు అనుభం ఎదురైనా తనిష్క్ ఇలాంటి యాడ్లు ఎందుకు చిత్రీకరిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా’’ అంటూ ఓ వర్గం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దీంతో తనిష్క్ తమ యాడ్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది. అయితే మరి కొంతమంది మాత్రం.. ఇందులో తప్పుపట్టాల్సిన విషయం ఏముందని, దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని, దివ్వెల పండుగ పేరు చెప్పి, పర్యావరణ కాలుష్యానికి కారకులయ్యేవారే ఈ యాడ్‌ను తప్పుబడతారంటూ తనిష్క్‌ను సమర్థిస్తున్నారు. అయితే అదే సమయంలో యాడ్‌ను తొలగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన సయానీ గుప్తా.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పర్యావరణ కాలుష్యాన్ని కట్టడిచేయాలని పిలుపునిస్తే దానిని కూడా మతానికి ముడిపెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయాలతో విద్వేషాన్ని చిమ్మడం సరికాదంటూ హితవు పలికారు. కాగా ఏకత్వం పేరిట కొత్త కలెక్షన్ ప్రవేశపెట్టిన తనిష్క్.. ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళ సీమంతం వేడుక థీమ్‌తో యాడ్ రూపొందించగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. లవ్ జీహాదీని ప్రోత్సహించేలా ఉన్న ఈ యాడ్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పాటుగా, #BoycottTanishq పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసి ఆగ్రహం ప్రదర్శించడంతో దానిని తొలగించారు. -
వైరల్ యాడ్ తొలగించిన తనిష్క్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ సోషల్‌మీడియా నుంచి తన యాడ్‌ను తొలగించింది. రెండు రోజుల నుంచి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం తనిష్క్ ఒక యాడ్‌ను క్రియేట్ చేసింది. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ పొందుపరిచింది. దీనిపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. బాయ్‌కాట్ తనిష్క్ అంటూ నిన్నంతా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ జిహాద్‌ను తనిష్క్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కావడంతో తనిష్క్ ఆ యాడ్‌ను తొలగించింది. చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్.. -
తనిష్క్ వజ్రాభరణాలపై 25% డిస్కౌంట్
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా మూతపడిన షోరూంలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ వెల్లడించింది. పునఃప్రారంభం సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు ఆభరణాల తయారీ, వజ్రాభరణాల విలువపై 25% వరకూ రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫర్ జూన్ 22 వరకు ఉంటుందని సంస్థ జ్యువెలరీ డివిజన్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ రజనీ కృష్ణస్వామి అన్నారు. కోవిడ్–19 విజృంభిస్తున్న దృష్ట్యా షోరూంలలో కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేసినట్లు ప్రకటించారు. -
బంగారం కొనుగోళ్లపై భారీ ఆఫర్లు
బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయను ఎంతో శుభప్రదమైనదిగా చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో ఈ రోజు బంగారం కొనుగోళ్లు కూడా భారీగానే చేపడతారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురష్కరించుకుని కంపెనీలు సైతం భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్ జువెల్లర్స్ బంగారం, డైమాండ్ జువెల్లర్స్ మేకింగ్ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. అదేవిధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ కూడా గోల్డ్ కాయిన్లను, గిఫ్ట్ కార్డులను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. గోల్డ్ కాయిన్లపై పీసీ జువెల్లర్స్ తక్కువ ధరలనే ఆఫర్ చేస్తోంది. ఇలా ఆఫర్లతో బంగారం దుకాణాలు హోర్రెత్తిస్తున్నాయి. తనిష్క్ జువెల్లరీ : బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 25 శాతం తగ్గింపును ప్రకటించిన తనిష్క్ ఈ నెల 18 వరకే ఈ అవకాశంగా పేర్కొంది. తనిష్క్ మంగళం జువెల్లరీలోనే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉండనుంది. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చని తెలిపింది. తమ బంగారు ఉత్పత్తుల్లో గాజులు, చెవి దిద్దులు, రింగులు, వడ్డానం, చెయిన్లు, మంగళ సూత్రాలు, బ్రాస్లెట్లు, పెండెంట్లు వంటివి ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ : ఎక్స్‌క్లూజివ్‌గా ‘అక్షయ తృతీయ’ ఆన్లైన్ ఆఫర్‌ను ఈ జువెల్లరీ సంస్థ చేపట్టింది. అంతేకాక రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారం కాయిన్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. ఒకవేళ బిల్లు రూ.30,000 అయితే రెండు బంగారం కాయిన్లు అందుకుంటారు. ఒక్కో కాయిన్ బరువు 150 మిల్లీగ్రాములు. దీనికి అదనంగా కొనుగోలులో 5 శాతం విలువకు సరిపడా గిఫ్ట్ కార్డు లభిస్తుంది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ పేర్కొంది. కల్యాణ్ జువెల్లర్స్ : కల్యాణ్ అయితే ఏకంగా 25 లక్కీ కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను గెలుచుకునే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 25 మెర్సిడెస్ బెంజ్ కార్లను మాత్రమే కాక, గోల్డ్ కాయిన్లను ఆఫర్లుగా ప్రకటించింది. ప్రతి రూ.5000 బంగారభరణాల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ గెలుచుకునే అవకాశాన్ని కల్యాణ్ అందిస్తోంది. అదే రూ.5000 విలువైన వజ్రాభరణాలకైతే రెండు లక్కీ కూపన్లను ఆఫర్ చేస్తోంది. రూ.25000 విలువైన జువెల్లరీ కొనుగోళ్లకు ఉచితంగా ఒక గోల్డ్ కాయిన్, అంతేమొత్తంలో డైమాండ్ జువెల్లరీ కొంటే రెండు గోల్డ్ కాయిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు కల్యాణ్ జువెల్లరీ ప్రకటించింది. పీసీ జువెల్లరీ సైతం గోల్డ్ చెయిన్లను అత్యంత తక్కువ ధరలకు అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. -
అనంతలో ‘తనిష్క్’ జువెలరీ
అనంతపురం అగ్రికల్చర్: దేశవ్యాప్తంగా పేరుగాంచిన టైటాన్ కంపెనీ అనుబంధ ‘తనిష్క్’ జువెలరీ షోరూం గురువారం అనంతపురం నగరంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ఏరియా బిజినెస్ మేనేజర్ సీతారామరాజు బుధవారం తెలిపారు. ఆర్ఎఫ్ రోడ్డులోని శివసాయిహోండా షోరూం పక్కన ఉదయం 11 గంటలకు జువెలరీ షాప్‌ను కంపెనీ జనరల్ మేనేజర్ బి.గోపాలనాథం ప్రారంభించునున్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలకు పేరుగాంచిన తనిష్క్ సేవలను జిల్లా వాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సీతారామరాజు కోరారు.