హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ‘హై–లైట్స్’ ప్లాట్‌ఫామ్‌పై 3,500పైగా లైట్ వెయిట్(తేలికపాటి) ఆభరణాలను ఆవిష్కరించింది. చెవి రింగులు, ఉంగరాలు, నెక్లెస్ సెట్స్, గాజులు, పెండెంట్స్, మంగళసూత్రాలు వంటి అన్ని ఉత్పత్తులు ఇందులో లభించనున్నాయి. వీటి ధరలపై 15–20% వరకు తగ్గింపు ప్రకటించింది. ఇటీవల కస్టమర్లు అమితాసక్తి చూపుతున్న తేలికపాటి ఆభరణాలను తనిష్క్ హై–లైట్స్ వేదికగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉందని సంస్థ సీఈవో అజోయ్ చావ్లా తెలిపారు. వీటి ధరలు తక్కువ ఉండటంతో కస్టమర్లు తమ బడ్జెట్‌పై భారం లేకుండా ఎక్కువ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment