
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ బ్రాండ్ తనిష్క్... నూతన శ్రేణి మంగళ సూత్రాలను విడుదల చేసింది. బంగారం, వజ్రాలతో అత్యంత కళాత్మకంగా, పూర్తి వైవిధ్యంగా మొత్తం 15 రకాల డిజైన్లతో వీటిని తీర్చిద్దిద్దారు.
ఆధునిక సంప్రదాయాలను అభిమానించే యువ వధువుల మనసును ఆకట్టుకొనేలా వీటిని రూపొందించామని కంపెనీ హెడ్ డిజైన్ అధికారి శ్రీ అభిషేక్ రస్తోగి తెలిపారు. అన్ని వర్గాల కమ్యూనిటీల ప్రాధాన్యతకు తగ్గట్లుగా తయారు చేయడమే కాక రోజూవారీ వస్త్రధారణతో సౌకర్యవతంగా కలిసిపోతాయని ఆయన పేర్కొన్నారు.