
హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా మూతపడిన షోరూంలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ వెల్లడించింది. పునఃప్రారంభం సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు ఆభరణాల తయారీ, వజ్రాభరణాల విలువపై 25% వరకూ రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫర్ జూన్ 22 వరకు ఉంటుందని సంస్థ జ్యువెలరీ డివిజన్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ రజనీ కృష్ణస్వామి అన్నారు. కోవిడ్–19 విజృంభిస్తున్న దృష్ట్యా షోరూంలలో కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేసినట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment