బోథ్‌లో విత్తనాలు కొంటున్న రైతులు
బోథ్/ఇచ్చోడ: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతులకు మాత్రం విత్తనాలే బంగారం. అందుకే... మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో విత్తన విక్రయ దుకాణాలు రైతులతో కిటకిటలాడాయి. వానాకాలం సాగు కోసం ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని జిల్లా రైతులు భావిస్తారు. ఈ మేరకు చాలామంది రైతులు పత్తి, సోయా విత్తనాలు కొనుగోలు చేశారు.
అక్షయ తృతీయ నుంచే ప్రారంభం
కొన్నేళ్లుగా అక్షయ తృతీయ రోజు నుంచే వానాకాలం సాగు మొదలు పెడుతున్న. ఈ రోజు పత్తి విత్తనాలు కొంటే మంచి దిగుబడి వస్తుందని నమ్మకం. జూన్‌లో వర్షాలు పడగానే ఈ విత్తనాలు విత్తుకుంటం. దీంతో పంటలో మంచి దిగుబడి వస్తుందని మా నమ్మకం.
– కామాజి, అడేగామ(కె) రైతు
Comments
Please login to add a commentAdd a comment