అక్షయ తృతీయకు ఖగోళ ప్రాధాన్యత | Astronomical significance of akshaya tritiya | Sakshi
Sakshi News home page

అక్షయ తృతీయకు ఖగోళ ప్రాధాన్యత

Published Fri, May 2 2014 4:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

అక్షయ తృతీయకు ఖగోళ ప్రాధాన్యత

అక్షయ తృతీయకు ఖగోళ ప్రాధాన్యత

అక్షయ తృతీయ హిందువులకు, జైనులకు పవిత్రమైన రోజు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మూడవరోజును అక్షయ తృతీయగా పిలుస్తారు. అక్షయ తృతీయతకు అనేక శాస్త్రాలలో ప్రాధాన్యత ఇవ్వబడింది.


 ఖగోళశాస్త్ర ప్రాధాన్యత


చైత్ర శుద్ధపాడ్యమి, ఆశ్యయుజ శుద్ధ దశమి (విజయదశమి), వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) ఈ మూడు రోజులూ హిందువులకు పవిత్రమైనవి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఈ మూడు రోజులూ తిథి సంపూర్ణంగా ఉంటుంది. అక్షయ తృతీయను నవన్న పర్వం అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది.


 అక్షయ తృతీయకు సంబంధించి పురాణాలలో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారాలలో ఆరవ అవతారమైన పరశురాముడు ఈ రోజునే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే వేదవ్యాసుడు మహాభారత రచనకు పూనుకుని, వినాయకునికి వివ రిస్తూంటే ఆయన రచించాడని కూడా ప్రతీతి.


 హిందువుల, జైనుల క్యాలెండర్లలో చాంద్రమానం ప్రకారం తిథులు, మాసాలు చూసినప్పుడు అందులో కొన్ని అధికం, కొన్ని ఏహ్యం వస్తుంటాయి. కానీ ఈ తిథి మాత్రం ప్రతి సంవత్సరమూ సంపూర్ణంగా ఉంటుంది.


 సంస్కృతంలో అక్షయ అనే పదానికి అంతము లేనిదనీ అంటే అది నిత్యం ఉండేదనీ అర్థం. ఈ తిథి ఇంటికి శుభాలను, విజయాలను చేకూర్చుతుందని హిందువుల విశ్వాసం. ఈ రోజు కనక ఎవరికైనా దానం చేస్తే, భగవంతుడు వారికి వరాలనిస్తాడని, ఆశీర్వాదాలు అందచేస్తాడని విశ్వసిస్తారు. కొత్తపనులు ఆరంభించడానికి ఈ తిథిని అమోఘమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రారంభించిన పని అక్షయంగా వృద్ధిచెందుతూ ఉంటుందని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.


 హిందూమతం


 అక్షయ తృతీయ నాడు... రూ.  మహాభారత రచన ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఆ రోజునే వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారత రచన చేశాడని ప్రతీతి రూ. స్థితికారకుడైన విష్ణుమూర్తి పరిపాలిస్తాడని విశ్వసిస్తారు రూ. పరశురామజయంతిగా జరుపుకోవడం ప్రతీతి రూ. ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమయిందనే విశ్వాసం కూడా ఉంది రూ. పరమపవిత్రమైన గంగానది ఈ రోజునే స్వర్గం నుంచి భూమి మీదకు ప్రవహించిందని విశ్వసిస్తారు రూ. అన్నపూర్ణాదేవి కూడా ఈ రోజునే జన్మించిందని చరిత్ర ఉంది రూ. శివపురంలో నివసించే శివుడిని కుబేరుడు ప్రార్థించగా, ఆయనచే ఆశీర్వదింపబడి సిరిసంపదలను పొందడమే కాకుండా, లక్ష్మీదేవితో పాటుగా సంపదలను రక్షించే పదవిని చేపట్టింది కూడా ఈ రోజునేనని చెబుతారు రూ. సముద్రం నుంచి భూమిని వెలికి తీసుకువచ్చినది కూడా ఈ రోజే రూ. యముడి కుమారుడైన ధర్మరాజు అక్షయపాత్రను పొందిన రోజు ఇదే.

 

ఆ పాత్రతతో తన రాజ్యంలోని వారి అవసరాలన్నీ తీర్చాడని మహాభారతం చెబుతోంది రూ. శ్రీకృష్ణుడు  రాజైన తర్వాత అతడిని కలవడానికి, కృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడు వచ్చింది కూడా ఈ రోజే. తాను పేదవాడు కావడంతో కేవలం అటుకులు మాత్రమే తీసుకువస్తాడు కుచేలుడు. అందుకు ప్రతిగా శ్రీకృష్ణుడు మహారాజభవనం ఇచ్చాడు రూ. దుర్యోధనుని ఆజ్ఞానుసారం దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం కావించగా, శ్రీకృష్ణుడు అక్షయంగా చీరలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడింది కూడా ఈ రోజే రూ. ఆదిశంకరాచార్యుడు కనకధారాస్తవం చేసిన రోజు.ఒక పేద బ్రాహ్మణ దంపతులు శంకరాచార్యులకు భిక్ష వేయడానికి ఏమీ దొరకకపోవడంతో ఒక ఉసిరికాయను మాత్రమే ఆయనకు భిక్ష వేయగా, ఆయన చ దివిన కనకధార స్తవానికి ఉసిరికాయలు అక్షయంగా కురిశాయని ప్రతీతి.


 పలు ప్రాంతాలలో...


 రూ. ఒరిస్సాలో అక్షయ తృతీయనాడు రైతులు పొలం దున్నడం ప్రారంభిస్తారు రూ. పూరీ జగన్నాథుని రథయాత్రకు కావలసిన రథాలను తయారుచేయడం ఈ రోజునే ప్రారంభిస్తారు రూ. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపుగింజలతో పూజిస్తారు రూ. ఈ రోజున గంగలో స్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతారు రూ. కొత్త వ్యాపారాలు చేయడానికి మంచిరోజు రూ. ఈ రోజు జ్ఞానసముపార్జన చేయాలనుకున్నా, దానాలు చేసినా ఎంతో ఫలవంతం అవుతుందని ప్రతీతి. ఈ రోజు... బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు... ఏది దానం చేసినా మంచిదే రూ. బెంగాలీయులు ఈ తిథినాడు ఎన్నో హోమాలు నిర్వర్తిస్తారు రూ. వినాయకుడికి, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు.


 జాట్లకు కూడా ఇది పరమపవిత్రమైన రోజు. ఈ రోజున ఉదయమే ప్రతి ఇంటిలోని ఇంటి యజమాని (మగవారు) నాగలి (షావెల్) పుచ్చుకుని పొలానికి వెళతాడు. అన్నిరకాల పక్షులు జంతువులు గుంపులుగుంపులుగా తరలి వెళ్లడం కనిపిస్తుంది. అంటే పంట వేసుకోవడానికి అనువైనదని సూచనగా ఉంటుంది. పెళ్ళిళ్లకు దీనిని అద్భుతమైన ముహూర్తంగా పరిగణిస్తారు. సుదర్శన కుబేర యంత్రాన్ని పూజించడం ఆనవాయితీ.


 ఇవి చేయాలి...


 ఈ రోజు పుణ్యకర్మలు ఆచరించడానికి ప్రశస్తం. జపం, తపస్సు, దానాలు, యజ్ఞయాగాలు, పవిత్ర స్నానాలు, హోమాలు చేయడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ఉపనయనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి నిర్మాణం ప్రారంభించడం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేస్తారు. కొన్ని వర్గాలలో చెట్లు నాటడం, ప్రయాణం చేయడాన్ని నిషేధిస్తారు. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. ఈ రోజున ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈరోజు చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవి ప్రతిమను కొనడానికి ఉత్సాహం చూపుతారు. ఇంతేకాకుండా బంగారు నాణేలు, వజ్రాల నగలు కూడా కొంటారు.
 ఎన్నో ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు ఉన్న అక్షయ తృతీయ అందరికీ సకల శుభాలూ కలుగచేయాలని ఆశిద్దాం.
 
 
 - డా. పురాణపండ వైజయంతి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement