
అక్షయ తృతీయకు ఎన్నికల ఎఫెక్ట్
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : వైశాఖ మాసంలో తమిళ ప్రజలు ప్రత్యేకంగా నిర్వహించుకునే పండుగ అక్షయ తృతీ య. ఈ పండుగ ప్రస్తుతం దేశ వ్యా ప్తంగా విస్తరించింది. ఈ రోజున ఏ పనులు ప్రారంభించినా శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదేరోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులను కొంటే తరగని సౌభాగ్యానికి గుర్తుగా ఉండడంతో పాటు సంవత్సరమంతా శుభం కలుగుతుందని నమ్ముతారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారు అక్షయ తృతీయ రోజున చిన్నపాటి బంగారం ముక్కో, లేదంటే వెండి వస్తువో కొనుగోలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
అయితే ఈ ఏడాది మరికొద్ది రోజు ల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ ఈ పండుగపై ప్రభావం చూపిస్తోంది. దీంతో బంగారం, వెండి విక్రయాల మందకొడిగా సాగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
అక్షయ తృతీయను పురస్కరించుకుని వినియోగదారుల అవసరార్థం జిల్లాలోని అన్ని బంగారం, వెండి దుకాణాల్లో వివిధ రకాల నమూనాలు కలిగిన వస్తువులను వ్యాపారస్తులు అమ్మకాలకు సిద్ధంగా ఉంచా రు. జిల్లా వ్యాప్తంగా బంగారం, వెండి వస్తువు లు విక్రయించే దుకాణాలు సుమారు 200 వరకు ఉండగా ఒక్క విజయనగరం పట్టణంలోనే వంద వరకు ఉన్నాయి. రోజుకు సగటున 5 కోట్ల రూపాయిల మేర బంగారం, వెండి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి.
తెలుగు సంవత్సరాది ఉగాది తరువాత అక్షయ తృతీయ రోజుకు మరో మంచి పర్వదినంగా ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది ఇదే అక్షయ తృతీయ నాటికి 22 క్యారెట్ల బంగారం తులం దర రూ. 29,160 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 32,300 వరకు ఉండేది. ప్రస్తుతం ఈ ధరలలో కాస్త పెరుగుదల నమోదైంది. విజ యనగరం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,735 ఉండ గా, 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 35,738 రూపాయిలు పలుకుతుంది. వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.47వేల రూపాయిల పైగా పలుకుతోంది. ఇదిలా ఉండగా ఈ పండుగ నేపథ్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వ్యాపారు లు ఆఫర్లు వర్షం కురిపిస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లో ఈ ఆఫర్ లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
కొనుగోళ్లుపై ఎన్నికల ఎఫెక్ట్..
ఈ ఏడాది అక్షయ తృతీయకు ఎన్నికల ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు తరలించరాద ని, అలా చేస్తే స్వాధీనం చేసుకోవటంతో పా టు కేసులు పెడతామని అధికారులు తేల్చి చెబుతున్న విషయం విదితమే. దీంతో జేబు లో డబ్బులున్నా ఎక్కడ అదుపులోకి తీసుకుంటారోనని ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పండుగ సమీపించి నా ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు రోడ్డుపైకి డబ్బుతో రావాలంటే భయపడాల్సి న పరిస్థితులు వస్తున్నాయి. నిత్యం కొద్దో గొ ప్పో బంగారం కొనుగోలు చేసే వారు తమకు అరువు ఇప్పించాలని ఎన్నికలు తర్వాత మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తామంటూ బ్రతిమలాడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వారంరోజులు ముందు సందడి కనిపించగా.. ప్రస్తుతం పండుగ రోజు వచ్చినా గిరాకీ పెరగలేదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ సందడికి చాలా మందిని దూరం చేశాయన్న భావన వ్యక్తమవుతోంది.
వ్యాపారం తగ్గింది...
ప్రతి ఏడాది అక్షయ తృతీయ వస్తుందంటే కొద్ది రోజుల ముందు నుంచే దుకాణాల్లో సందడి ఉండేది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఎన్నికల నేపథ్యం లో డబ్బు తరలించకూడదన్న నియమావళి ఉండడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. గురువారం కాస్త వ్యాపారం జరిగింది. శుక్రవారం మరింత జోరందుకుంటుంద ని బావిస్తున్నాం.
- సురేష్, మేనేజర్, షాపింగ్ మాల్.