రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం! Today Gold And Silver Prices May 9th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!

Published Thu, May 9 2024 1:58 PM

gold price today rate may 9 Akshaya Tritiya

పసిడి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ వచ్చేస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈరోజు (మే 8) కూడా కాస్త దిగొచ్చాయి.

క్రితం రోజున కాస్తంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో అక్షయ తృతీయ పర్వదినం వేళ బంగారం కొనాలనుకుంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేనా విలువైన వస్తువులు కొంటే అక్షయం అవుతుందని భారతీయుల నమ్మకం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి  రూ.66,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 తగ్గి రూ. 72,160 లకు దిగొచ్చింది.

ఇతర ప్రధాన నగరాల్లో..
➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 దిగొచ్చి రూ.72,310 లకు చేరింది. 
➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.110 క్షీణించి రూ.72,160 వద్దకు తగ్గింది.
➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.
➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.

వెండి రివర్స్‌!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.200 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.85,200లుగా ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement