
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రినాథుని చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 2.45 గంటల నుంచే భక్తుల కోసం లఘుదర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
సాధారణ భక్తులకు దర్శనం కోసం రూ. 200, రూ. 500 టికెట్ల విక్రయిస్తుండగా.. వీఐపీ భక్తుల కోసం వెయ్యి రూపాయల టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గోశాల, అడవివరం పార్కింగ్ ప్రదేశాల నుంచి కొండపైకి ఉచిత బస్సులను నడిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment