
Is Netflix Offers To Rajamouli For A Web Series: 'బాహుబలి: ది బిగినింగ్'తో తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శక ధీరుడు రాజమౌళి. తర్వాత వచ్చిన 'బాహుబలి: ది కన్‌క్లూజన్' అంతకుమించిన విజయం సాధించింది. ఇక ఇటీవల వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్'తో తెలుగు సినిమాకు తిరుగు లేదనిపించేలా హిట్ కొట్టాడు జక్కన్న. రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీపై హాలీవుడ్ ప్రముఖులతోపాటు అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. దీంతో రాజమౌళి పేరు ఒక బ్రాండ్‌గా మారింది. ఇప్పుడు తాజాగా ఈ బ్రాండ్‌తో ఓ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ప్రణాళికలు వేస్తోందట ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.
ఇంతకుముందు 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అతి కొద్ది రోజులకే ఆ ప్రాజెక్టు ముందుకుపోలేదు. తాము ఆశించిన స్థాయిలో చిత్రీకరణ లేదని ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్'తో మరోసారి రాజమౌళి పేరు వరల్డ్ వైడ్‌గా వినిపిస్తోంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ రాజమౌళిని ఓ వెబ్‌సిరీస్ కోసం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఇటు రాజమౌళి టీమ్, అటు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్పందించలేదు. కాగా జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
'ఆర్‌ఆర్‌ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ
ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment