జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలు పోలీసు శాఖకు సవాలుగా మారాయి. నిత్యం ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.
నిజామాబాద్ క్రైం: జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలు పోలీసు శాఖకు సవాలుగా మారాయి. నిత్యం ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు, బంగారు నగలు ఎత్తుకుపోవటం, రోడ్లపై వెళ్లే మహిళల మెడ లో నుంచి బంగారు గొలుసులు తెంపుకుని పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్ బాస్ ఉండే జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నిజామాబాద్ నగరంలో అయిదు ఠాణా లు ఉన్నాయి.
దాదాపు 200 మందికిపైగా పోలీసు సి బ్బంది పనిచేస్తున్నారు. అయినప్పటికీ వరుస చోరీ లకు అదుపులేకుండా పోయింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 266 ఇండ్లలో, దుకాణాలలో దొంగత నాలు జరిగాయి. సుమారు రూ. 2.84 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లారంటే దొంగలు ఏ రీతిన రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు! దొంగతనాలను అదుపుచేసేందుకు పోలీసు లు పెట్రోలింగ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దొంగలు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడ ఇండ్లలో చొరబడి నగదు, నగలు ఎత్తుకెళ్తున్న ఘటనలు ఉన్నాయి.
పరిధి పెద్దగా ఉండి
జిల్లాలో కొన్ని ఠాణాల పరిధి ఎక్కువగా ఉండటంతో పోలీసులకు పెట్రోలింగ్ సమస్య ఏర్పడుతోంది. ఉదాహరణకు జిల్లా కేంద్రంలోని నాల్గవ పట్టణ ఠాణా పరిధిలో ఎల్లమ్మగుట్ట, రైల్వేకమాన్ నుంచి మొదలుకుని ప్రగతినగర్, శ్రీనగర్ కాలనీ, యెండల టవర్స్, వినాయక్‌నగర్, పాత, కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీలు, బ్యాంక్ కాలనీ, మహాలక్ష్మీనగర్, బోర్గాం(పి) గ్రామం, గాయత్రినగర్, సాయినగర్, చంద్రనగర్, సూర్యనగర్, న్యాల్‌కల్‌రోడ్డు, వివేకానందనగర్, రోటరీనగర్, ఆర్‌టీసీ బస్‌డిపో-2 ప్రాంతాలు ఉన్నాయి. పరిధి ఎక్కువగా ఉండి తగినంత మంది సిబ్బంది లేక పోవటంతో పోలీసులు పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు.
పాత నేరస్థులపై అనుమానాలు
జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్నది పాత నేరస్థులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వారి వివరాల కోసం పోలీసులు పాత ఫైళ్ల దుమ్ము దులు పుతున్నారు. దొంగతనం కేసులో శిక్ష అనుభవించిన నేరస్థులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో 44 ఠాణాలు, రెండు వేల మంది వరకు పోలీసులు ఉన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసుల పెట్రోలింగ్‌తోపాటు, ప్రజలతో గస్తీ దళాలు ఏర్పాటు చేస్తే కొంతవరకై నా ఫలితం లభించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.