
పండగ వచ్చిందంటే చాలు.. చాలామంది బంగారం కొంటుంటారు. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా బంగారం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోనుఆమె తన యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసింది. బంగారు నగలను అలంకరించుకుంటూ తెగ మురిసిపోయిందామె. అయితే అవన్నీ తనకు కాదని తన తల్లి కోసం కొన్నానని చెప్పుకొచ్చింది.
ఆ నగలను ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లిన అషూ తల్లికి గిఫ్టిచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేసింది. తనకోసం బంగారు నగలు కొనుక్కురావడంతో ఆమె చాలా ఎగ్జయిట్ అయింది. అంతకు ముందు కొన్న బంగారు గాజులకు ఇవి చాలా బాగా సెట్టవుతాయని సంతోషపడింది. అషూకు ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందంటూ ఆశ్చర్యపోయింది. కాగా అషూ రెడ్డి ప్రస్తుతం 'సర్కస్ కార్ 2' చిత్రంలో నటిస్తోంది. ఇది నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తుండగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment