చోరీ జరిగిన ఇంట్లో పరిశీలిస్తున్న ఓఎస్‌డీ విఠలేశ్వర్‌రావు తదితరులు
కోవూరు: ఇంటి మేడపై నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగలు కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని రెండు బీరువాల్లో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ ఘటన కోవూరు మండలంలోని సత్యవతినగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. ఏఎస్‌పేట విశ్రాంత ఎంఈఓ మహబూబ్‌జానీ కుటుం బసభ్యులకు ఆరోగ్యం సక్రమంగా లేక కర్నూలులోని అమృత న్యూరో హాస్పిటల్‌లో చికిత్స చేయించుకొంటున్నారు.
గురువారం రాత్రి మహబూబ్‌జానీ కుమారుడు అశ్విత్‌ఖాన్ దూరబంధువైన ఇలియాజ్‌తో కలిసి ఇంట్లో మేడ మీద ఓ గదిలో నిద్రపోయారు. తెల్లవారుజామున కిందకు వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులకొట్టి అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 సవర్ల బంగారు నగలతోపాటు రెండు లాప్ టాప్‌లు, ఒక ట్యాబ్ తీసుకువెళ్లినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి చోరీలు జిల్లాలో నాలుగైదు జరిగాయని ఓఎస్‌డీ విఠలేశ్వర్‌రావు తెలిపారు. ఆయన వెంట సీఐలు శ్రీనివా సులురెడ్డి, క్రైమ్ బ్రాంచ్ సీఐతోపాటు కోవూరు ఎస్‌ఐ వెంకట్రావు, క్లూస్‌టీం ఇన్‌చార్జి రవీంద్రరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment