సాక్షి, మంచిర్యాల : ‘మీకు బంగారు ఆభరణం కావాలా..? ఖరీదు చేసే ఆర్థిక స్థోమత లేదా..? ఏం పర్వాలేదు.. మా దగ్గర ఓ స్కీం ఉంది. ప్రతినెలా మీకు తోచినంత (రూ.వెయ్యిపైనే) డబ్బు చెల్లించండి. ఆ ఆభరణం ఖరీదంతా డబ్బు మీరు చెల్లించిన తర్వాత.. కోరిన నక్లెస్ మీకు అందజేస్తాం. నమ్మండి.. రండి.. మా స్కీంలో చేరండి...’ ఇప్పుడు జిల్లాలో ఎక్కడ విన్నా ఇలాంటి ప్రకటనలే.
వ్యాపారులకు డబ్బే డబ్బు
జిల్లాలో జోరుగా కొనసాగుతున్న ‘స్కీం’లు వ్యాపారులపై కనకవర్షం కురిపిస్తున్నాయి. బిజినెస్‌లో ‘ట్రెండ్’ మార్చిన వ్యాపారులు నయాపైసా పెట్టుబడి లేకుండా కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అమాయక, ప్రజల అవసరాలను ఆసరా చేసుకుంటూ కొందరు మార్కెట్లో సరికొత్త స్కీంలు ప్రవేశపెడుతున్నారు. నెలకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తే కొన్ని నెలల తర్వాత వాయిదాల్లో వారు చెల్లించిన డబ్బులు విలువ చేసే ఆభరణం, భూమి ఇస్తామంటూ నమ్మిస్తున్నారు.
ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తమ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. వ్యాపారం బాగా జరిగి లాభం చేకూరితేనే ప్రజలకు ‘స్కీం’లో చెప్పినట్టుగా వస్తువులు అందజేస్తున్నారు. లేకపోతే జెండా ఎత్తేస్తున్నారు. ఇటీవల మంచిర్యాలలో నామమాత్రం గా ప్రారంభమైన జువెల్లరీ షాపుల్లో వ్యాపారులు స్కీం పేరిట వసూలు చేసిన డబ్బు మొ త్తాన్ని పెట్టుబడిగా పెట్టడం చర్చనీయాంశమైం ది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ వంటి ప్రధాన పట్టణాల్లో ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది.
నమ్మి.. మోసపోతున్న జనం
సాధారణంగా వ్యాపారులు నిర్వహిస్తున్న ఇలా ంటి ‘స్కీం’లకు పోలీసుల అనుమతి అవసరం ఉండదు. వ్యాపారులెవరైనా నమ్మించి మోసం చేసినా వ్యాపారులపై బాధితులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. స్కీంలను ఎలా నమ్మావని పోలీసులు ప్రశ్నిస్తారనే భయమే బాధితుల వెనకడుగు వేసేలా చేస్తోంది.
బాధితుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జిల్లాలో వ్యాపారులు కూడా ఇష్టారాజ్యంగా స్కీంలు నిర్వహిస్తున్నారు. కేవలం మంచిర్యాల పట్టణంలోనే 60కి పైగా షాపుల్లో రకరకాల స్కీంలు అమలవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంగారు ఆభరణం, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, ఏసీ, ఎల్‌ఈడీ టీవీ, మోటారు బైక్ (షోరూంలలో కాదు), వస్త్రాలు, సెల్‌ఫోన్లు, కిరాణం షాపులతోపాటు రియల్ ఎస్టేట్స్ రంగాల్లో అమలవుతోన్న స్కీంలు ‘ఔరా’ అనిపిస్తున్నాయి.
మచ్చుకు కొన్ని..!
- ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ జువెల్లర్ షాపు యజమాని వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే ఆభరణాలు ఇస్తానని నమ్మించాడు. ప్రతి నెలా ప్రజల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయలు రియల్ ఎస్టేట్స్‌లో పెట్టుబడి పెట్టాడు. వ్యాపారంలో నష్టం రావడంతో భార్య, ఇద్దరు పిల్లలతోపాటు తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.
- 2011లో ‘ఎన్మార్ట్’ కంపెనీ పేరుతో మంచిర్యాలలో విస్తృత ప్రచారం చేసిన వ్యక్తి ప్రతి నెలా రూ.1,500 కిరాణం సరుకులు ఇంటికి సరఫరా చేస్తానని నమ్మించాడు. మంచిర్యాల పట్టణంలో 8 వేల మంది నుంచి రూ.5,500 డిపాజిట్ తీసుకుని ఉడాయించాడు.
- 20012లో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తానని నమ్మించిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ బిల్డర్.. మెంబర్ షిప్ కింద ప్రతి వ్యక్తి నుంచి రూ.10 వేలు వసూలు చేసి పరారయ్యాడు. మంచిర్యాలకు చెందిన బాధితులే రెండొందలకు పైగా ఉన్నారు.
- 2012లో స్థానికంగా పేరున్న ఓ వ స్త్ర వ్యాపారి సంబంధీకుడొకరు స్కీం పేరిట మంచిర్యాలలో ప్రజల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి వ్రస్త్ర వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. వ్యాపారంలో నష్టం వచ్చి ఉడాయించాడు.
‘స్కీం’లతో జర భద్రం
Published Thu, Dec 18 2014 3:57 AM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM
Advertisement
Advertisement