దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది. 2019లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఈ సారి ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
మీడియా కథనాల ప్రకారం మొదటి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో జరగనుండగా.. మార్చి 14 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
టార్గెట్ 400
కాగా, 2019లో ఏడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ సారి బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్‌డేట్ అయ్యిందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 40 సీట్లైనా రావాలని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment