ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మార్చి 4 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూల్‌లో భాగంగా నేడు నాగపూర్ నుంచి తెలంగాణలోకి ఆదిలాబాద్‌కు చేరుకోనున్నారు.
తెలంగాణ తర్వాత తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ - కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ పర్యటించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మకంగా 29 కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ విభిన్న ప్రాంతాలు వర్గాలతో అనుసంధానం అయ్యేలా, కీలకమైన సమస్యలను పరిష్కరిష్కరించనున్నారు. ఇక ఎన్నికలకు ముందు ప్రజల్ని ఆకట్టుకునేందుకు మోదీ పర్యటన దోహదం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment