అక్టోబర్ 2024 ముగుస్తోంది. ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చేశాయి. అయితే ఈ మాసం చివర దీపావళి పండుగ రాబోతోంది. ఈ తరుణంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎప్పుడెప్పుడు బ్యాంకులు మూతపడతాయి. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలను ఎలా పొందాలి అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
దీపావళి పండుగ ఈ నెల 31న జరగనుంది. కాబట్టి ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు పనిచేయవు. అంతే ఆ రోజు అన్ని బ్యాంకులకు సెలవన్నమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1వ తేదీన పండుగ జరుపుకోనున్నారు. నవంబర్ 2న లక్ష్మీ పూజ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. ఆ తరువాత నవంబర్ 3 ఆదివారం దేశంలోని అన్ని బ్యాంకులకు యధావిధిగా సెలవు. దీన్ని బట్టి చూస్తే వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు. నవంబర్ 5 నుంచి బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment