సాక్షి,ముంబై: ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు దేశీయ స్టాక్‌మార్కెట్లను దెబ్బతీసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు క్షీణించి 33,695 స్థాయికి చేరింది. నిఫ్టీ 66 పాయింట్లు క్షీణించి 10,132 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 10200 కిందికి చేరింది.
ముఖ్యంగా ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగనున్న నేపథ‍్యంలో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయనున్నారనే వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీంతో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఒక్క ఐటీ తప్ప అన్ని సెక్టార్లుబలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ అత్యధికంగా నష్టపోగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ వెనకడుగు వేశాయి. డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, హిందాల్కో, మారుతీ, జీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, ఇన్‌ఫ్రాటెల్ 5-2 శాతం నష్టపోతుండగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐబీ హౌసింగ్, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, హీరోమోటో లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment