ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్ | Allu Arjun Interesting Comments About Allu Aravind And His Vijetha Movie Remuneration, See Netizens Reactions Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: అలా చేసిన అల్లు అరవింద్‌.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న బన్నీ!

Published Sun, Dec 24 2023 6:57 PM | Last Updated on Sun, Dec 24 2023 7:25 PM

Allu Arjun Comments Allu Aravind And Vijetha Movie Remuneration - Sakshi

స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో బన్నీ నుంచి మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ లాంటివి ఏం లేవు. బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు. అయితే సడన్‌గా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో డిస్కషన్‌కి కారణమైంది.

ఇంతకీ ఏం జరిగింది?
తండ్రి అల్లు అరవింద్ స్వతహాగా నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్.. సినిమా వాతావరణంలోనే పెరిగాడు. అయితే బన్నీ రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి 'విజేత' మూవీలో నటించాడు. దీని గురించి ఫ్యాన్స్‌కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తాజాగా ఈ సినిమా షీల్ట్‌తో అల్లు అరవింద్ ఉన్న ఫొటోని బన్నీ పోస్ట్ చేశాడు. ఓ ఫన్నీ విషయాన్ని రివీల్ చేశాడు.

(ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్‌పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!)

డబ్బులు ఇవ్వలేదు
'నా తొలి సినిమా విజేత.. మై ప్రొడ్యూసర్(నాన్న).. ఓ మైగాడ్. ఇందులో యాక్ట్ చేసినందుకు డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చింది' అని అల్లు అర్జున్.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. అయితే ఇదంతా ఫన్నీగా ఉండటంతో నెటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. తండ్రి డబ్బులు ఎగ్గొట్టేశాడని బన్నీ పెట్టిన స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతుంది. దీని తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్స్‌తో బన్నీ సినిమాలు చేయబోతున్నాడు. వీళ్లిద్దరూ కాకుండా మరికొందరు డైరెక్టర్స్ కూడా లైన్‍‌లో ఉన్నారు.

(ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement