జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇలాంటి సమయంలో అందరూ చాలా సంయమనం పాటించాలని ఆయన కోరారు.' మీరందరూ మా ఇంటి వద్ద జరిగింది అంతా చూశారు. కానీ, ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం.. దేనికీ రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చారు.
ఆందోళన చేసిన వారిపై కేసు పెట్టారు. ఇక్కడికి ఎవరైనా గొడవ చేసేందుకు మళ్లీ వస్తే అలాంటి వారిని తీసుకెళ్లేందుకు పోలీసులు ఇక్కడే ఉన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వారు వచ్చారని మేము మాట్లాడే పరిస్థితి లేదు. ఈ సంఘటన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. మేము సంయమనంగానే ఉన్నాం. ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు' అని అల్లు అరవింద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment