త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే! | Allu Aravind Makes Ramayanam Movie With Alia bhatt and Ranbeer Kapoor | Sakshi
Sakshi News home page

Ramayanam: పట్టాలెక్కనున్న మరో రామాయణం.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా!

Published Thu, Jun 8 2023 3:43 PM | Last Updated on Thu, Jun 8 2023 3:47 PM

Allu Aravind Makes Ramayanam Movie With Alia bhatt and Ranbeer Kapoor - Sakshi

రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.  

(ఇది చదవండి: ఫోటోలు షేర్‌ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి)

అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్‌ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్‌ హీరో యశ్‌ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

గతంలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అల్లు అరవింద్‌ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

(ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement