పాడె మోసిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌.. వీడియో | Allu Arjun Performs Final Rites For His Grandmother Allu Kanakaratnamma | Sakshi
Sakshi News home page

Allu Arjun: పాడె మోసిన అల్లు అర్జున్‌, చిరంజీవి, రామ్‌చరణ్‌..

Aug 30 2025 4:02 PM | Updated on Aug 30 2025 4:11 PM

Allu Arjun Performs Final Rites For His Grandmother Allu Kanakaratnamma

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి అల్లు అర్జున్‌, మైసూర్ నుంచి రామ్ చరణ్ హుటాహుటిన హైద‌రాబాద్ వచ్చేశారు. 

ముగిసిన అంత్యక్రియలు
నానమ్మ పార్థివదేహాన్ని చూసి అల్లు అర్జున్‌ (Allu Arjun) భావోద్వేగానికి లోనయ్యాడు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌ నివాసానికి వచ్చి కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు అర్జున్‌, అల్లు అయాన్‌, చిరంజీవి, రామ్‌చరణ్‌... కనకరత్నమ్మ పాడె మోశారు. అల్లు అరవింద్‌.. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement