‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ ఆడి పాడేస్తున్నారు నాగచైతన్య (Naga Chaitanya) , సాయిపల్లవి. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే మూడో పాటని గురువారం రిలీజ్ చేశారు.
శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు. ‘‘మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి..’, ‘నమో నమః శివాయ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. వండర్‌ఫుల్ మెలోడీస్‌ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ‘హైలెస్సో హైలెస్సా..’ అంటూ సాగే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment