
‘తండేల్’ సెట్స్‌లో డిష్యుం డిష్యుం అంటూ అదిరిపోయే మాస్ ఫైట్స్ చేస్తున్నాడు రాజు. నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు.
‘యానిమల్’ సినిమాకు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ‘తండేల్’లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment