Tandel: ప్రేమ కబుర్లు | Sai Pallavi Special Poster Released From Tandel Movie, Goes Viral | Sakshi
Sakshi News home page

తండేల్‌ నుంచి సాయిపల్లవి పోస్టర్‌ రిలీజ్‌

Published Thu, May 9 2024 6:05 AM | Last Updated on Thu, May 9 2024 11:51 AM

Sai Pallavi special poster is released from Tandel Movie

మొబైల్‌లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. ఈ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్‌ డే. 

ఈ సందర్భంగా ‘తండేల్‌’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. సత్యభామ ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement