Sai Pallavi Comments On Pimples Surgery And Healthy Hair Secret, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Sai Pallavi: నా రింగుల జుత్తు సీక్రెట్ ఇదే.. సాయిపల్లవి కామెంట్స్

Published Wed, May 1 2024 9:40 AM | Last Updated on Wed, May 1 2024 4:59 PM

Sai Pallavi Comments On Pimples Surgery And Hair Secret

ప్రస్తుత జనరేషన్‌లో మిగతా హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి కాస్త డిఫరెంట్. నటన, పాత్రల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తుంది. 'ప్రేమమ్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం 'తండేల్' సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి.. తమిళంలో శివకార్తికేయన్ మూవీలో చేస్తోంది. హిందీలో 'రామాయణ్' పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

సరే ఇదంతా పక్కనబెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తన శారీరక సౌందర్యం గురించి మాట్లాడింది. 'ప్రేమమ్' మూవీ టైంలో ముఖంపై మొటిమలు చాలా ఉండేవి. తనకు చిత్రంలో అవకాశం రావడానికి కారణమే కూడా అవే. ప్రస్తుతం మాత్రం తన ముఖంపై ఎలాంటి మొటిమలు లేవు. అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా? అని చాలామంది అడుగుతున్నారు. కానీ తాను ఎలాంటి చికిత్స గానీ థెరఫీ గానీ చేయించుకోలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం సహజమేనని చెప్పిన సాయిపల్లవి.. అవి పోవడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదన్నారు. వాటంతటికి అవే పోతాయని చెప్పింది. తన ఒత్తయిన జుత్తు సీక్రెట్ గురించి చెప్పిన ఈ బ్యూటీ.. తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటానని, ఆలోవెరా జెల్స్ ఉపయోగిస్తానని తెలిపింది. 

(ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement