
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టొరీ 'తండేల్' షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

'తండేల్' సెట్స్ నుండి కొన్ని షూట్ డైరీస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య వైబ్, స్నేహపూర్వక అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయి. సెట్స్‌లో ఇంటెన్స్, పాషన్ నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది

ఒక ఫోటోలో చందూ మొండేటి అల్లు అరవింద్‌కి ఒక సన్నివేశం గురించి వివరిస్తుండగా, మరొక ఫోటో బన్నీ వాసు, నాగ చైతన్య, చందూ మధ్య సరదా సంభాషణను చూపుతుంది

నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ డి-గ్లామరస్ అవతార్‌లలో పాత్రలకు అనుగుణంగా కనిపిస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి కథను ప్రామాణికంగా చెప్పడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు

నటీనటుల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కనిపించేలా చూసుకుంటున్నారు. త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు



