రూ. 2 కోట్లు ఆఫర్‌ ఇచ్చినా అందుకు నో చెప్పిన సాయిపల్లవి | Sai Pallavi Rejected Cosmetics Ad | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్లు ఆఫర్‌ ఇచ్చినా అందుకు నో చెప్పిన సాయిపల్లవి

Published Sat, May 11 2024 6:42 AM | Last Updated on Sat, May 11 2024 11:41 AM

Sai Pallavi Rejected Cosmetics Ad

నటిగా తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్‌ను పెట్టుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. ఈమె చదివింది వైద్యవిద్య అయినా అయ్యింది నటి. తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న  సాయిపల్లవి. దీంతో మలయాళం, తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే నటిగా  కొన్ని నిర్ధిష్టమైన భావాలకు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా ఉంటడం. సహజత్వానికి ప్రాధాన్యత నివ్వడం. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం వంటి విషయాల్లో చాలా క్లియర్‌గా ఉంటారు. 

తన పాత్రకు అవకాశం లేకపోతే నిక్కచ్చిగా నిరాకరించేస్తుంది సాయిపల్లవి. అది ఎంత పెద్ద స్టార్‌ నటుడి చిత్రం అయినా సరే. అలా జరిగింది కూడా. అలాంటి నటి ఇప్పుడు సైలెంట్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదీ రామాయణ్‌ చిత్రంలో సీతగా నటించే అవకాశం వరించింది. ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఆ ఫొటోలను చూస్తే సీత పాత్రలో సాయిపల్లవి ఎంతగా ఒదిగి పోయారో అని అనిపిస్తుంది. ఇకపోతే తెలుగులో నాగచైతన్య సరసన తండేల్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా నటిస్తున్న అమరన్‌ చిత్రాన్ని పూర్తి చేశారు.

కాగా నటి సాయిపల్లవికి ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి రూ. 2 కోట్లు పారితోషకం ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయిపల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. కారణం అది ఒక సౌందర్య సాధనకు చెందిన ప్రకటన కావడమేనట. అలాంటి సౌందర్య వస్తువులతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలుగుతాదన్న ఒక్క కారణంగా అంత పారితోషాకిన్ని చెల్లిస్తానన్నా సాయిపల్లవి నో చెప్పారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  గతంలో కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement