Naga Chaitanya: వెండితెరపై ‘జోష్’ చూపిస్తున్న చిన్న ‘బంగార్రాజు’ | Happy Birthday Naga Chaitanya: Special Story On Naga Chaitanya Film Career | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: వెండితెరపై ‘జోష్’ చూపిస్తున్న చిన్న ‘బంగార్రాజు’

Published Thu, Nov 23 2023 10:14 AM | Last Updated on Thu, Nov 23 2023 11:01 AM

Happy Birthday Naga Chaitanya: Special Story On Naga Chaitanya Film Career - Sakshi

నట వారసులు చాలా మందే..వెండితెర మీదికి వస్తున్నారు. నాగ చైతన్యకు మాత్రం రెండు అగ్ర కుటుంబాల నేపథ్యం ఉండటం విశేషం.ఏఎన్‌ఆర్‌ మనవడిగా, నాగార్జున కుమారుడిగా అలాగే తల్లి వైపు నుంచి నిర్మాత డి రామానాయుడు మనవడిగా, హీరో వెంకటేష్‌ మేనల్లుడిగా సిల్వర్ స్క్రీన్‌ మీదికి అడుగు పెట్టాడు.రెండు కుటుంబాల పరువు నిలబెట్టాలా సిల్వర్ స్క్రీన్‌ మీద సత్తా చూపిస్తున్నాడు. నేడు(నవంబర్‌ 23) నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.

అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా వచ్చి..పేరు నిలబెట్టుకున్నాడు నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య దిల్‌ రాజు బ్యానర్‌లో రూపొందిన జోష్‌ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అయితే ఈ మూవీ మాత్రం అపజయం పాలైంది.  వాస్తవానికి చైతు.. దిల్‌ రాజు బ్యానర్‌లోనే రూపొందిన కొత్త బంగారు లోకం మూవీతో  పరిచయం కావాల్సింది. లవ్‌ స్టోరీతో కాకుండా...మెసేజ్‌ ఇచ్చే కథతో తనకొడుకును ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు ఫాదర్ నాగార్జున.. అందుకే జోష్‌ స్టోరీకే ఓటు వేసాడు.

ఇక అక్కినేని హీరోలు అంటే అందగాల్లు..వీళ్లకు లేడీస్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టే..ఈయన నటించిన రెండో మూవీ ఏం మాయ చేసావేలో లవ్ బాయ్‌గా కనిపించాడు. గౌతమ్ వాసుదేవ్‌ మీనన్ దర్శకత్వం చేసిన ఈ మూవీలో నాచురల్‌ గా నటించి ఆకట్టుకున్నాడు. సమంత కూడా జెస్సీ పాత్రలో..ఈ మూవీతోనే వెండితెరకు పరిచయం అయ్యింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది

100% లవ్‌తో నాగచైతన్య మరోమెట్టు ఎక్కాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా రూపొందింది. తమన్నా హీరోయిన్‌గా నటించింది.కథ,కథనంతో పాటు..సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొదటి సారి కామెడీ కూడా పండించాడు చైతు. మరోవైపు కంటతడి పెట్టించేలా కూడా నటించాడు. ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది

లవర్ బాయ్‌గా దూసుకుపోతాడు అనుకున్న నాగచైతన్య..ఈ సారి తప్పటడుగు వేసాడు. తనకు అంతగా వర్కౌట్‌ కాని మాస్‌ పాత్రలో కనిపించాలి అనుకున్నాడు. వెండితెర మీద యాక్షన్ చేసి..ఆడియన్స్‌ను ఆకట్టుకువాలి అనుకున్నాడు. అయితే అప్పుడే ..చైతును...మాస్ హీరోగా చూడటానికి ప్రేక్షకులు రెడీగా లేరని ధడ, బెజవాడ సినిమాలు నిరూపించాయి. 

యాక్షన్ హీరోగా ఎన్ని ఫీట్లు చేసిన కూడా ...విజయం సాధించలేకపోయాడు. రెండు సినిమాలు అపజయం పాలవ్వటంతో..ఈ సారి తన తడాఖా చూపించాలి అనుకున్నాడు. కోలీవుడ్ హిట్ వెట్టయికి రీమేక్‌గా రూపొందిన తడఖా మూవీతో వచ్చాడు. ఈ మూవీలో సునీల్,చైతులిద్దరు అన్నాతమ్ముళ్ల పాత్రలో కనిపించారు.100 % లవ్‌ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన తమన్నా నాగచైతన్యతో జోడి కట్టింది..ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పర్వాలేదు అనిపించుకుంది.

తండ్రి నాగార్జున మాదిరిగానే కూల్ అండ్‌ కామ్‌గా ఉండే స్వభావం నాగ చైతన్యది.అక్కినేని వంశం నుండి మూడో తరం వారసుడిగా వచ్చిన చైతూ సపరేట్ ఫ్యాన్ బెస్‌ క్రియేట్ చేసుకున్నాడు. కమర్శియల్ సినిమాలు చేస్తునే. బెస్ట్ యాక్టర్‌గా కూడా నిరూపించుకుంటున్నాడు. తన ఛాయిస్‌ సినిమాలతో దర్శకుల ఛాయిస్ హీరోగా మారిపోయాడు

అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్‌ మూవీగా మనం మూవీ నిలిచింది.విక్రమ్ కె కుమార్ దర్శకత్వం చేసిన ఈ మూవీలో అక్కినేని హీరోలందరు కలిసి నటించారు.ఇది నాగేశ్వర్ రావు చివరి చిత్రం .ఇక ఈ మూవీ అక్కినేని అభిమానులనే కాదు...సామన్య ప్రేక్షకున్ని కూడా మెప్పించి మంచి విజయం సాధించింది.చైతును నటుడుగా కూడా ఓ మెట్టు ఎక్కించింది

లవర్ బాయ్‌ నాగచైతన్య మనం సినిమా తర్వాత ఓ వైపు ప్రేమికుడి పాత్రలలో కనిపిస్తునే,మరోవైపు మాస్ ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేసాడు. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటోనగర్ సూర్య సినిమాచేసాడు. అలాగే విభిన్నంగా ట్రై చేస్తు..దోచెయ్ మూవీలో నటించాడు. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో ఒక లైలా కోసం మూవీతో వచ్చాడు. ఈ సినిమాలు ఆశించిన విజయం మాత్రం సాధించలేదు.

ఈ ఫ్లాప్స్ పరంపరకు ప్రేమమ్ సినిమా బ్రేక్ వేసింది.మలయాళంలో హిట్ కొట్టిన ప్రేమమ్‌కు రీమేక్‌గా రూపొందింది ఈ మూవీ. చందు మొండేటిదర్శకత్వం తెరకెక్కింది. శృతి హాసన్‌,అనుపమా పరమేశ్వరన్‌,మడోన్నా సెబస్టియన్‌ కథానాయికలుగా నటించాడు. తెలుగు లో ఈ మూవీ డీసెంట్ విజయం నమోదు చేసింది

ప్రేమమ్ మూవీ తర్వాత సాహసం శ్వాసగా సాగిపో మూవీతో పాటు రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో నటించాడు చైతు..సాహసం శ్వాసగా సాగిపో మూవీ విజయం సాధించకపోయినా..చైతుకు మంచి పేరే తీసుకువచ్చింది. రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో ...ఓ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు
 

ఈ క్లాస్ బాయ్‌...యుద్దం శరణం, శైలెజారెడ్డి అల్లుడు లాంటి సినిమాలో యాక్షన్ చేసే ప్రయత్నం చేసాడు. అలాగే సవ్యసాచి లాంటి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ లాంటి డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీస్ చైతుకు విజయాన్నిఅందించలేకపోయాయి. మరోవైపు సావిత్రి బయోపిక్‌గా రూపొందిన మహానటి మూవీలో తాత అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్‌లో కనిపించి..అభిమానులను అలరించాడు

కెరీర్‌లో కొత్త మజిలీ మొదలు పట్టాడు నాగ చైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీతో హిట్ ట్రాక్‌ మీదికి వచ్చాడు.. డిఫరెంట్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించి శభాష్‌ అనిపించుకున్నాడు. భగ్న ప్రేమికుడిగా,హస్సెండ్ క్యారెక్టర్‌లో కనిపించి నటుడిగా..మంచి మార్కులు వేసుకున్నాడు. ఈ సినిమా విజయానికి కథ,కథనంతో పాటు...నాగ చైతన్య యాక్టింగ్ కూడా ప్లస్‌గా నిలిచింది

మామ వెంకటేష్‌ తో కూడా కలిసి..స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చైతు. యాక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన వెంకీ మామలో ఈ ఇద్దరు మామ అల్లుళ్ల పాత్రలలో మెప్పించారు. చైతుకు జోడిగా రాశి ఖన్నా నటించింది. ఈ మూవీ కూడా హిట్ కొట్టి..బాక్సాఫీసు దగ్గర డెబ్బై కోట్ల వరకు రాబట్టింది.

వరసగా రెండు విజయాలు రావటంతో..ఈ సారి హ్యాట్రిక్‌ మీద కన్నేసాడు నాగ చైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీలో నటించాడు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. అట్టడుగు కులానికి చెందిన తెలంగాణ యువకుడిగా అద్బుతమైన నటన ప్రదర్శించాడు. ఈ మూవీ హైలెట్స్‌లలో నాగ చైతన్య నటన కూడా ఒకటి.

బంగార్రాజు మూవీతో వరసగా నాలుగో విజయం అందుకున్నాడు నాగ చైతన్య..మరోసారి నాన్న నాగార్జునతో కలిసి నటించాడు. సొగ్గాడే చిన్న నాయన మూవీకి సీక్వెల్‌ గా ఈ మూవీ తెరకెక్కింది. ఫాదర్,సన్‌గానే ఈ మూవీలో వెండితెర మీద కనిపించారు. 2022 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఈ సినిమా. చిన్న బంగార్రాజు పాత్రలో తండ్రికి తగ్గ తనయుడిగా ఈ మూవీ కనిపించి మురిపించాడు

సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న నాగ చైతన్య..ఈ సారి డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకున్నాడు. అలాంటి సబ్జెక్టులను సెలక్ట్ చేసుకున్నాడు .విభిన్న స్టోరీలతో సినిమాలను తెరకెక్కించే దర్శకులను ఎంచుకున్నాడు .అందుకోసం బౌండరీలు మరోసారి దాటాడు. ఇతర భాష దర్శకులతో సినిమాలు చేసాడు.

మజిలీ,వెంకీమామ,లవ్‌ స్టోరీ ,బంగార్రాజు లాంటి హిట్ సినిమాల తర్వాత మనం సినిమాతో హిట్ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేసాడు. థాంక్యు టైటిల్ తో వచ్చిన ఈ మూవీలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌,అవికా గోర్‌ లాంటి వారు హీరోయిన్‌గా కనిపించారు. కాని సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది

థాంక్యూ మూవీ తర్వాత కోలీవుడ్‌ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో కస్టడీ మూవీలో నటించాడు. పవర్‌ ఫుల్ పోలీస్‌గా ఈ మూవీలో కనిపించాడు.యాక్షన్ థ్రిల్లర్..సబ్జెక్ట్‌తో ఈమూవీ రూపొందింది. అయితే..ఈ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. దాంతో బాక్సాఫీసు దగ్గర మినిమం వసూల్లు కూడా రాబట్టలేకపోయింది.

అమిర్‌ ఖాన్ లాల్ సింగ్‌ చద్దా మూవీలో ఓ ప్రధాన పాత్రలో కనిపించాడు.ఈ మూవీ బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. అలాగే మొదటి సారి దూత్ అనే వెబ్‌ సిరీస్‌తో డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం చందు మోండెటి దర్శకత్వంలో కెరీర్‌లో 23 వ సినిమా  చేస్తున్నాడు. ఈ చిత్రానికి తండేల్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మరి రాబోతున్న సినిమాలు..చైతుకు విజయాలు తీసుకురావాలని అశిద్దాం.

👉:​​​​​​​ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement