స్టార్ హీరోయినే కానీ మేకప్ వేయదు! ఈ బ్యూటీ గుర్తుపట్టారా? | Actress Sai Pallavi Childhood Pic With Her Dad Viral | Sakshi
Sakshi News home page

Guess The Actress: డ్యాన్స్ షోల నుంచి పాన్ ఇండియా వరకు.. ఇదీ హీరోయిన్ రేంజ్!

Published Mon, Jul 15 2024 1:55 PM | Last Updated on Mon, Jul 15 2024 3:04 PM

Actress Sai Pallavi Childhood Pic With Her Dad Viral

హీరోయిన్లు ఎందుకు నచ్చుతారు అంటే సమాధానం చెప్పడం కష్టం. కొందరు అందంగా ఉన్నారని నచ్చుతారు. మరికొందరు బాగా నటించారని నచ్చుతారు. ఇంకొందరు సింప్లిసిటీ వల్ల నచ్చేస్తారు. ఇప్పుడు చెప్పిన మూడు క్వాలిటీస్ కూడా ఈ హీరోయిన్‌లో ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే సినిమా అనగానే మేకప్ కంపల్సరీ. కానీ ఈ బ్యూటీ మాత్రం మేకప్ వేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న చిన్న పిల్ల పేరు సాయిపల్లవి. అవును మీరు ఊహించింది కరెక్టే. 'ప్రేమమ్' (మలయాళ), 'ఫిదా' సినిమాలతో హీరోయిన్‌గా తనకుంటా సెపరేట్ మార్క్ సృష్టించుకున్న బ్యూటీనే. తమిళనాడులోని ఓ గిరిజన తెగలో పుట్టి పెరిగిన సాయిపల్లవి.. చిన్నప్పటి నుంచే డ్యాన్సుల్లో ఇరగదీసేది. అలా టీనేజీలోనే పలు డ్యాన్స్ షోల్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులోనూ 'ఢీ' ప్రోగ్రామ్‍‌లో పాల్గొంది. ఇక చదువు కోసం కొన్నాళ్లు డ్యాన్సులకు బ్రేక్ ఇచ్చింది. పెద్దయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!)

మలయాళ 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. దీని తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. గత రెండేళ్లుగా సాయిపల్లవి సినిమాలు చేయకపోయేసరికి ఇండస్ట్రీకి దూరమైపోయిందేమో అనుకున్నారు. ప్రస్తుతం 'తండేల్', 'రామాయణ్' లాంటి పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది. ఈ రెండు రిలీజైతే సాయిపల్లవి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోవడం గ్యారంటీ!

తాజాగా తన తండ్రి 60వ పుట్టినరోజు సందర్భంగా క్యూట్ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తండ్రితో తన చాలా చిన్నప్పటి ఫొటోని షేర్ చేసుకుంది. ఇది చూసి సాయిపల్లవి ఎంత ముద్దుగా ఉందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసేస్తున్నారు. మరి పాప ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement