దసరాకు తండేల్‌! | Naga Chaitanya Thandel Movie release on Dussehra | Sakshi
Sakshi News home page

దసరాకు తండేల్‌!

Published Mon, Feb 19 2024 12:04 AM | Last Updated on Mon, Feb 19 2024 4:41 AM

Naga Chaitanya Thandel Movie release on Dussehra - Sakshi

దసరా పండక్కి థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట ‘తండేల్‌’. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

``కాగా ‘తండేల్‌’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట దర్శకుడు చందు మొండేటి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement