![Kollywood Actors Helps Stage Dancers - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/26/TN.jpg.webp?itok=JSGS-YDH)
చెన్నై: స్టేజ్ నాట్య కళాకారులకు సినీ నటీనటులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని పలువురు పలు రకాలుగా ఆదుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్టేజ్ నాట్య కళాకారులకు సాయం చేయడానికి అంగాడి తెరు సింధు, నటుడు డేనియల్ హృదయరాజ్, వసంతకుమార్‌తో పాటు యువోఎంఎస్ మిత్రబృందం ముందుకు వచ్చారు. వీరు గురువారం చెన్నైలో 80 మంది స్టేజ్ నాట్య కళాకారులకు బియ్యం తదితర తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment