Buzz: Allu Arjun Pushpa 2 The Rule Movie Massive Special Song Shooting In Resort, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Shooting In Hyderabad: హైదరాబాద్‌ రిసార్ట్‌లో పుష్ప పార్టీ సాంగ్‌

Published Sat, Jul 1 2023 4:07 AM | Last Updated on Sat, Jul 1 2023 8:50 AM

Allu Arjun Pushpa 2 special Song shoot - Sakshi

పుష్పరాజ్‌ పార్టీ ఇస్తున్నాడు. ఈ పార్టీ సందడి ఎంత గ్రాండ్‌గా ఉంటుందనేది సిల్వర్‌ స్క్రీన్‌పైనే చూడాలట. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లీగా హీరోయిన్‌ రష్మికా మందన్నా నటిస్తున్నారు. ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ ఆల్రెడీ విడుదలై, ఘనవిజయం సాధించింది.

ప్రస్తుతం మలిభాగం ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్‌. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ఓ రిసార్ట్‌లో జరుగుతోందని తెలిసింది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా పాల్గొనగా ఓ పాట చిత్రీకరిస్తున్నారని, సినిమాలో ఇది పార్టీ సాంగ్‌గా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement