తప్పించుకోవడానికి రీజన్ దొరకటం లేదు: సమంత | Cannot find a good enough excuse to not work today : samantha | Sakshi
Sakshi News home page

తప్పించుకోవడానికి రీజన్ దొరకటం లేదు: సమంత

Published Wed, Jun 8 2016 9:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

తప్పించుకోవడానికి రీజన్ దొరకటం లేదు: సమంత

తప్పించుకోవడానికి రీజన్ దొరకటం లేదు: సమంత

నటనతోనే కాదు తన బిహేవియర్తో కూడా టాలీవుడ్ ఆడియన్స్కు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్గా మారిన ముద్దుగుమ్మ సమంత. తెర మీదే కాదు, సోషల్ మీడియాలో కూడా తన మార్క్ స్టేట్మెంట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. బుధవారం ఉదయం హైదరబాద్ వాతావరణానికి సంబంధించి సమంత చేసిన ట్వీట్ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ లో పాల్గొంటుంది సమంత. బుధవారం ఉదయం హైదరాబాద్లో జల్లులు కురుస్తుండటంతో వాతావరణం చాలా డల్గా ఉంది. దీంతో ఈ రోజు షూటింగ్ తప్పించుకోవడానికి ఏ రీజన్ చెప్పాలో అర్థం కావటం లేదంటూ ట్వీట్ చేసింది సమంత. తాజాగా 'అ ఆ' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన సమంత టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement