జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్' కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ జోరు ప్రదర్శిస్తున్నది. తెలుగు సినీ చలనచిత్ర చరిత్రలో మూడో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా మూడోవారంలో నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. మూడోవారానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.106 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇందులో రూ. 81.4 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వచ్చాయని తెలుస్తోంది. ఇక ఒక్క కర్ణాటకలో రూ.16 కోట్లు వసూలుకాగా, కేరళలో రూ. 4 కోట్లు రాబట్టింది. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 120 కోట్లు వసూలు చేసిన ’జనతా గ్యారేజ్’... బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పవన్ కల్యాణ్ ’అత్తారింటికి దారేది’ సినిమా వసూళ్లను ’జనతా’ దాటేసిందని బాక్సాఫీస్ టాక్ ను బట్టి తెలుస్తోంది.