
కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సైన్ చేయటం లేదు. త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న కారణంగానే కొత్త సినిమాలకు అంగీకరించటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో, తను సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదో స్పష్టత ఇచ్చింది. మంచి పాత్రలు రానందు వల్లే సినిమాలు ఒప్పకోవటం లేదని సమంత తెలిపింది.
'దక్షిణాది సినీరంగంలో హీరోయిన్లుకు అర్థవంతమైన పాత్రలు దొరకటం ఎంత కష్టమో ఇప్పుడిప్పెడే అర్ధమవుతోంది. కేవలం మంచి పాత్రలు రాని కారణంగా ఇంత వరకు ఏ సినిమాను అంగకీరించలేదు. ఈ విషయం చెప్పటం నాకేంతో బాధ కలిగిస్తోంది.' అంటూ ట్వీట్ చేసింది. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన సమంత ఆ సినిమా తరువాత ఇంత వరకు ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు.
Realising just how hard it is to get a meaningful role for a heroine in the south. #timeforchange #nowornever
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 17 September 2016
I haven't signed as many films as I d like too only and only because there are no good roles . As disheartening as it is to say .
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 17 September 2016